ప్రచార వాహనంపై స్పృహతప్పిన ఎమ్మెల్సీ కవిత

18 Nov, 2023 12:32 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రచార వాహనంలో స్పృహతప్పి పడిపోయారు. రాయికల్‌ మండలం ఇటిక్యాలలో శుక్రవారం కవిత రోడ్‌ షోలో పాల్గొన్నారు. జగిత్యాల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌ కుమార్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు

ఈ క్రమంలో ‍ప్రచార వాహనంపై నిలబడి ఉండగా కవిత ఒక్కసారిగా కళ్లుతిరిగి పడిపోయారు. వెంటనే స్పందించిన బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు ఆమెకు సపర్యలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న గ్రంధాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్.. కవితకు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే కాసేపటికే కోలుకున్న కవిత తిరిగి ప్రచారం ప్రారంభించారు.

డిహైడ్రేషన్ వల్ల ఎమ్మెల్సీ కవిత స్పల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు.
చదవండి: Video: ఆసక్తికర వీడియోను షేర్‌ చేసిన ఎమ్మెల్సీ కవిత

మరిన్ని వార్తలు