కూర్చొని పనిచేస్తే..జీవితకాలం కరిగిపోతుంది

23 Sep, 2016 02:37 IST|Sakshi
కూర్చొని పనిచేస్తే..జీవితకాలం కరిగిపోతుంది

వాషింగ్టన్: గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేయడం అలవాటైనవారికి నిజంగానే ఇది చేదువార్త. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏటా మరణిస్తున్న వారిలో నాలుగు శాతం మంది వరుసగా మూడు, నాలుగు గంటలు ఒకే చోట కూర్చొని పనిచేస్తున్నవారేనని తాజా అధ్యయనంలో తేలింది. 2002 నుంచి 2011 వరకు 54 దేశాల్లో నమోదైన మరాణాలను శాన్ జార్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు విశ్లేషించారు. దీని ప్రకారం రోజులో మూడు గంటల కంటే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని పనిచేసే వారిలో 2002-11 వరకు ప్రతి ఏడాది 4.33 లక్షల మంది మృత్యువాత పడ్డారని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 60 శాతం మంది ప్రజలు మూడు గంటల కంటే ఎక్కువసేపు కూర్చొనే ఉంటున్నారని, ఇక యుక్తవయసులో ఉన్నవారు సుమారు 5 గంటలసేపు కూర్చొనే ఉంటున్నారని బ్రెజిల్‌లోని సావో పాలో వర్సిటీకి చెందిన లియాండ్రో రెజెండే ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు