కూర్చోని మాట్లాడుకుందాం రండి!?

16 Nov, 2017 19:45 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణల నేపథ్యంలో పాకిస్తాన్‌ వైఖరిలో మార్చు వచ్చినట్లు కనిపిస్తోంది. చతుర్భుజ కూటమితో భారత్‌ బలోపేతమవుతున్ననేపథ్యంలో పాకిస్తాన్‌.. రెండడుగులు వెనక్కి వేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్‌ సహా పలు వివాదాస్పద అంశాలపై భారత్‌తో చర్చలకు తాము సిద్ధమంటూ పాకిస్తాన్‌ గురువారం ప్రకటించింది.

దశాబ్దాలుగా అత్యంత వివాదాస్పద అంశంగా నలుగుతున్న కశ్మీర్‌ సహా, సియాచిన్‌, సిర్‌క్రీక్‌ వంటి అంశాలపై చర్చలు పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ.. పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్‌ ఫైసల్‌ ప్రకటించారు. బుధవారం ఆయన ఇస్లామాబాద్‌లో మాట్లాడుతూ.. చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం.. భారత ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించారు.

పాకిస్తాన్‌ సైనిక చట్టాల ప్రకారం.. మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించాక.. ఎవరినీ కలిసేందుకు అనుమతించం..అయితే కేవలం మానవతా దృక్ఫథాన్ని దృష్టిలో పెట్టుకుని కులభూషన్‌ జాదవ్‌ను కలిసేందుకు ఆమె భార్యకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో భారత్‌ క్రూయిజ్‌ మిసైల్‌ను పరీక్షించడంపైనా ఆయన స్పందించారు. భారత్‌ మిసైల్‌ పరీక్షలు నిర్వహించడం​ వల్ల రీజియన్‌లో శాంతి భద్రతలు ప్రమాదంలో పడతాయని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు