భారత్‌తో చర్చలకు సిద్ధం : ఇమ్రాన్‌ ఖాన్‌

27 Feb, 2019 16:18 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : భారత వైమానిక దళం మెరుపుదాడుల నేపథ్యంలో భారత్‌ - పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌తో చర్చలకు సిద్ధమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం పాక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘కలిసి కూర్చుని మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందాం. శాంతియుత వాతావరణంలో చర్చించుకుంటే మంచిది. సహనం కోల్పోతే పరిస్థితులు మరోలా ఉంటాయి. యుద్ధం మొదలైతే.. అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. అప్పుడు ఇక పరిస్థితులు మోదీ అదుపులోగాని.. నా అదుపులోగాని ఉండవు. యుద్ధం వస్తే రెండు దేశాలకు మంచిది కాద’న్నారు.

అంతేకాక ‘మీ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో.. మా దగ్గర కూడా అవే ఆయుధాలు ఉన్నాయి. ఉగ్రవాదం నిర్మూలనకు ఏం చేయాలో చెప్పండి. చర్చల ద్వారా మాత్రమే పరిస్థితులను అదుపు చేయగలం. పుల్వామా దాడి వల్ల మీకు దుఃఖం కల్గింది.. దానికి మేము బాధపడ్తున్నాము. ఇందుకు యుద్ధం పరిష్కారం కాదు. చర్చలతో మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది ’ అని తెలిపారు. అంతేకాక రెండు భారత యుద్ధ విమనాలను కూల్చేశామని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు