రిటైర్మెంటు వయసు తగ్గుతోంది!

20 Dec, 2016 10:20 IST|Sakshi
రిటైర్మెంటు వయసు తగ్గుతోంది!
పోలండ్‌లో రిటైర్మెంట్ వయసును తగ్గిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా ప్రకటించారు. ఈ మేరకు ఒక బిల్లు మీద ఆయన సంతకం చేశారు. దీంతో ఇక మీదట పురుషులకు 65 ఏళ్లు, మహిళలకు 60 ఏళ్లను రిటైర్మెంటు వయసుగా నిర్ణయించారు. ఇంతకుముందున్న ప్రభుత్వం పురుషులు గానీ, మహిళలు గానీ.. 67 ఏళ్ల పాటు ఉద్యోగం చేయాలని 2017 అక్టోబర్ 1వ తేదీన ఒక చట్టం చేసింది. దాన్ని రద్దు చేస్తూ ఇప్పుడు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. 
 
2015 ఎన్నికల్లో లా అండ్ జస్టిస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో రిటైర్మెంట్ వయసు తగ్గించడం ఒకటి. రిటైర్మెంటు వయసు తగ్గింపునకు సంబంధించిన ప్రెసిడెన్షియల్ డ్రాఫ్టును దిగువ సభ అయిన సెజ్మ్‌కు గత సంవత్సరం నవంబర్‌లో సమీక్ష కోసం పంపారు. సెజ్మ్‌ ఆ బిల్లును నవంబర్‌లో ఆమోదించి, డిసెంబర్ ప్రారంభంలో సెనేట్‌కు పంపింది. అక్కడ కూడా ఆమోదం పొందడంతో ఇప్పుడక్కడ రిటైర్మెంట్ వయసు తగ్గింది.
మరిన్ని వార్తలు