భారత్‌కు రానున్న ప్రిన్స్‌ చార్లెస్‌

28 Oct, 2019 18:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లండన్‌: ప్రిన్స్ ఆఫ్ వేల్స్, రాణి ఎలిజబెత్‌-2 తనయుడు, దివంగత ప్రిన్సెస్‌ డయానా భర్త చార్లెస్(70) నవంబర్‌లో రెండురోజులపాటు అధికారికంగా భారత్‌లో పర్యటించనున్నారు. వాతావరణ మార్పులు, సుస్థిర మార్కెట్లు, సోషల్‌ ఫైనాన్స్‌ అంశాలను దృష్టిలో పెట్టుకుని చార్లెస్‌ భారత్‌కు రానున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. చార్లెస్‌ తన 10వ అధికారిక భారత పర్యటనలో భాగంగా నవంబర్‌ 13న న్యూఢిల్లీకి రానున్నారని సమాచారం. భారత్‌కు ఆయన చివరిసారిగా తన రెండో భార్య కెమిల్లాతో కలిసి రెండేళ్ల క్రితం 2017 నవంబర్‌ లో వచ్చారు. యూరోపియన్ యూనియన్ (బ్రెక్జిట్‌) నుంచి వైదొలిగిన నేపథ్యంలో బ్రిటన్‌ భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చార్లెస్ తనయుడు ప్రిన్స్‌ విలియం తన భార్యతో కలిసి గతవారం పాకిస్తాన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా షాక్ : భారత్, చైనాకు మినహాయింపు

కరోనా వైరస్‌తో కొత్త లక్షణాలు

ట్రంప్‌కు ప్రిన్స్‌హ్యారీ, మార్కెల్‌ కౌంటర్‌

11,591 మరణాలు.. లాక్‌డౌన్‌ లేనట్లయితే!!

10 లక్షల మందికి టెస్టులు.. ఇటలీకి భారీ సాయం!

సినిమా

‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ ఆరోజే..!

సూర్య సినిమాలో పూజకు ఆఫర్‌!

కాజోల్‌, నైసా బాగున్నారు: అజయ్‌ దేవ్‌గణ్‌

సల్మాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

తారలు.. ఇంట్లో ఉన్న వేళ..

కరోనా విరాళం