బర్గర్లు ఇవ్వమంటే.. ఇవ్వరా?!

1 Oct, 2017 08:52 IST|Sakshi

రియో డి జెనీరియో : బ్రెజిల్‌లోని అత్యంత ఖరీదైన నగరాల్లో రియో డిజెనీరియో ఒకటి. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా జరిగే ప్రాంతం కావడంతో ఖరీదైన హోటళ్లు, రిసార్టులు, రెస్టార్లు భారీగా ఉన్నాయి. ఇవి ఏడాది పొడుగునా బిజీగానే ఉంటాయి. అందులోనూ మెక్‌ డోనాల్డ్‌ రెస్టారెంట్‌కు స్థానికంగా డిమాడ్‌ ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆరుమంది వ్యక్తులు రెస్టారెంట్ వచ్చి 40 బర్గర్లు కావాలని చెప్పారు. వేడివేడిగా బర్గర్లు తెచ్చాక.. బిల్‌ పే చేయమని కౌంటర్‌లోని వ్యక్తి అడిగాడు.. బర్గర్ల కోసం వచ్చిన వ్యక్తి.. నేను బిల్‌ పే చేయను.. అంటూ.. తన వెంట తెచ్చుకున్న గన్‌తో ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. అతనికి సహాయంగా మరో అయిదుమంది కూడా తుపాకులకు పని చెప్పారు. బుల్లెట్లు ఎక్కడ తగులుతాయన్న భయంతో రెస్టారెంట్‌లో ఉన్న వాళ్లంతా.. టేబుళ్ల కింద.. దాక్కున్నారు.

ఈ ఘటనలో అదృష్టవవాత్తు ఎవరూ గాయపడలేదని మెక్‌డోనాల్డ్‌ అధికారులు ప్రకటించారు. బుల్లెట్లు తగిలి రెస్టారెంట్‌ పర్నీచర్‌ చాలా వరకూ పాడైందని.. చెప్పారు. అయితే బర్గర్లుకు డబ్బులు చెల్లించకుండా.. తుపాకి కాల్పుల పాల్పడ్డవారు.. డ్రగ్స్‌ డీలర్లని సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు చెబుతున్నారు.


 

మరిన్ని వార్తలు