ఆరుగంటలు లైవ్లో స్పేస్ వాక్!

9 Aug, 2015 15:46 IST|Sakshi
ఆరుగంటలు లైవ్లో స్పేస్ వాక్!

వాషింగ్టన్: అమెరికాకు చెందిన నాసా సంస్థ ఓ మహత్తర కార్యక్రమానికి తెరతీసింది. రష్యాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు ఆరు గంటలపాటు అంతరిక్షంలో నడుస్తుండగా దానిని లైవ్లో అందించనుంది. అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉన్న ఇద్దరు రష్యా వ్యోమగాములు గెన్నడీ పడాల్కా, ప్లైట్ ఇంజినీర్ మికెయిల్ కోర్నెన్కో స్పేస్ వాక్ చేయనున్నారు.

ప్రత్యేక దుస్తులు ధరించి శూన్యంలోకి సోమవారం రాత్రి 19.44గంటల ప్రాంతంలో అడుగుపెట్టనున్నారు. అంతరిక్షంలో నడిచే సమయంలో వారు చుట్టూ ఉన్న ప్రదేశాలను చాలా స్పష్టంగా ఫొటోలు చిత్రీకరించనున్నారు. దీంతోపాటు వారు గ్యాప్ స్పానర్స్ అనే పరికరాలను, కమ్యూనికేషన్ యాంటెన్నాలను అంతరిక్ష కేంద్రం పై భాగంలో అమర్చనున్నారు.

మరిన్ని వార్తలు