లైంగికదాడి కేసులో సౌదీ యువరాజు అరెస్ట్

25 Sep, 2015 20:19 IST|Sakshi
లైంగికదాడి కేసులో సౌదీ యువరాజు అరెస్ట్

లాస్ ఏంజెలిస్: లైంగికదాడి కేసులో సౌదీ అరేబియా యువరాజు మజీద్ అబ్దులజీజ్ అల్ సౌద్ (28) ను అమెరికాలో లాస్ ఏంజెలిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మజీద్ను బుధవారం అరెస్ట్ చేసి ఆ మరుసటి రోజు గురువారం దాదాపు 2 కోట్ల రూపాయల పూచీకత్తుపై విడుదల చేసినట్టు పోలీసులు చెప్పారు.

మజీద్ శృంగారంలో పాల్గొనాల్సిందిగా ఓ పనిమనిషిని బలవంతం చేసినట్టు పోలీసులు తెలిపారు. మజీద్ ఎస్టేట్లో ఓ మహిళ సాయం చేయాల్సిందిగా కేకలు వేసిందని,  ఆమె రక్తస్త్రావంతో ఎస్టేట్ ప్రహారీ గోడ దాటేందుకు ప్రయత్నిస్తుండగా పొరుగు వ్యక్తి చూసినట్టు పోలీసులు చెప్పారు. వచ్చే నెల 19న మజీద్ను కోర్టులో హాజరుకావచ్చు. ఈ విషయంపై స్పందించేందుకు సౌదీ యువరాజు అందుబాటులోకి రాలేదు. సౌదీ దౌత్యకార్యాలయం అధికారులు కూడా స్పందించలేదు. ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన ఈ భవంతిని కొన్ని వారాల పాటు అద్దెకు తీసుకున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు