బీచ్‌ రక్తపు మయం: గగుర్పాటుతో పరుగులు

15 May, 2017 10:39 IST|Sakshi
బీచ్‌ రక్తపు మయం: గగుర్పాటుతో పరుగులు

దాదాపు 50 అడుగులు పొడవున్న ఓ వింత జంతువు మృతదేహం గత వారం ఇండోనేషియాలోని బీచ్‌ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కొట్టుకువచ్చిన చనిపోయిన భారీ ఆకారం నుంచి రక్తం వస్తుండటంతో బీచ్‌ మొత్తం రక్తపు నీటిగా మారిపోయింది. గగుర్పాటుకు గురి చేస్తున్న దాని ఆకారాన్ని చూసి బీచ్‌కు వచ్చిన సందర్శకులు అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్లో వైరల్‌ అయ్యాయి.

దీంతో ఈ వింత ఆకారంపై శాస్త్రవేత్తల దృష్టి పడింది. గతంలో ఎన్నడూ చూడని ఈ ఆకారం ఏంటా అని పరిశోధకులు తలలు పట్టుకుంటున్నారు. కొందరు ఇది ఒక రకమైన సముద్రపు వేల్‌ అని అంటున్నారు. చనిపోయిన వేల్‌ శరీరం కుళ్లిపోతుండటంతో జంతువు ఆకారం మరి వికారంగా తయారవుతోందని పరిశోధకులు భావిస్తున్నారు. సున్నిత మనస్కులు బీచ్‌లో రక్తపు నీటిని చూసి వణికిపోతుంటే.. ధైర్యం కలిగిన వారు సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

మరిన్ని వార్తలు