ఫేస్ బుక్ యూజర్లకు హెచ్చరిక | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్ యూజర్లకు హెచ్చరిక

Published Mon, May 15 2017 8:52 AM

ఫేస్ బుక్ యూజర్లకు హెచ్చరిక

కొజికోడ్ : ఫేస్ బుక్ లో వీడియోలను, పోస్టులను షేర్ చేసేటప్పుడు లేదా లైక్స్ కొట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ అవున్నాయి. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సైబర్ వింగ్ ఎక్కువగా ఫేస్ బుక్ యూజర్లు లైక్స్ లేదా షేర్ కొట్టే పోస్టింగ్స్, వీడియోలపైనే ఫోకస్ చేసినట్టు పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ఆధారితంగా యువకులను  ఐఎస్ షార్ట్ లిస్టు చేస్తుందని పోలీసు శాఖ పేర్కొంది. దీని ద్వారా వారి కార్యకలాపాలకు యువకులను రిక్రూట్ చేసుకుంటుందట. ఇప్పటికే ఈ విధంగా చాలా ఘటనలు జరిగాయని, కేరళలో 21 మంది యువకులు మిస్ అయ్యారని, వారు ఇస్లామిక్ స్టేట్స్ లో ఉన్నట్టు గుర్తించినట్టు అక్కడి పోలీసు అధికారులు చెప్పారు. ఐఎస్ సైబర్ వింగ్ ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పైన ఉన్న యువతనే టార్గెట్ చేస్తుందని తెలిపారు. 
 
ఈ సైబర్ వింగ్, ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లతో రన్ అవుతూ వీడియోలను, ఆర్టికల్స్ ను పోస్టు చేస్తుందని, వీటి ద్వారా యువతను షార్ట్ లిస్ట్ చేస్తుందని తిరువనంతపురం రుంజ్ ఐజీ మనోజ్ అబ్రహ్మం చెప్పారు. వారి పోస్టులను షేర్ చేసినా.. లైక్ చేసినా ఐఎస్ వారితో కాంటాక్ట్ అవుతారని చెప్పారు. ఫేక్ ఐడీలతో ఆన్ లైన్ లో కార్యకలాపాలు జరుపుతున్న వారిని కేరళ పోలీసు సైబర్ వింగ్ గుర్తిస్తుందని తెలిపారు. కేరళలో మిస్ అయిన 21 మంది యువకులు సిరియాకు వెళ్లి,  ఐఎస్ గ్రూప్ లో చేరినట్టు అబ్దులా రషీద్ వెల్లడించారు. వారు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారిన తేలింది. ఒక్కసారి సోషల్ మీడియాలో యువకులను టార్గెట్ చేసిన తర్వాత, వారిని లోకల్ ఏజెంట్ల ద్వారా ట్రాక్ చేసి, ఐఎస్ లో నియమించుకుంటున్నారని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తెలిపారు.      
 

Advertisement
Advertisement