ప్యారిస్లో పలు మసీదులపై దాడులు

8 Jan, 2015 15:29 IST|Sakshi

ఫ్రాన్సును ఉగ్రవాద భూతం వణికిస్తోంది. తాజాగా లియోన్ ప్రాంతంలోని ఓ మసీదు బయట శక్తిమంతమైన బాంబు పేలింది. అయితే ఇందులో ఎవరికీ గాయాలైనట్లు ఇంతవరకు సమాచారం అందలేదు. దాంతోపాటు పలు మసీదుల వద్ద కూడా దాడులు జరిగినట్లు సమాచారం అందుతోంది.

మరోవైపు.. బుధవారం నాటి చార్లీ హెబ్డో కార్యాలయంపై కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి నిందితులైన ఇద్దరు సోదరుల కోసం ఫ్రెంచి పోలీసులు గాలింపు జరుపుతున్నారు. గురువారం నాడు ఈ ఇద్దరి ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వీళ్లు సాయుధులని, అత్యంత ప్రమాదకరమైనవాళ్లని తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినట్లు ప్రధానమంత్రి మాన్యుయెల్ వాల్స్ తెలిపారు. పాత్రికేయుల మృతికి ఫ్రాన్స్ ఒకరోజు సంతాపం పాటిస్తోంది.

మరిన్ని వార్తలు