లాలాజల పరీక్షతోనూ ఆస్తమా నిర్ధారణ

18 Sep, 2016 13:45 IST|Sakshi

లండన్‌: సాధారణంగా రోగి ఊపిరితిత్తుల పనితీరు ఆధారంగా ఆస్తమా వ్యాధిని నిర్ధారిస్తారు. రోగి లాలాజలంపై పరీక్షలు జరిపి కూడా ఆస్తమాను నిర్ధారించవచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘ఊపిరితిత్తులు, రక్తం, మూత్ర పరీక్షల సందర్భంగా రోగి కాస్తంత ఇబ్బంది పడతాడు. కొత్త పద్ధతి అన్ని వయసుల వారికి ఎంతో సౌలభ్యంగా ఉంటుంది’ అని బ్రిటన్‌లోని లంగ్‌బారో వర్సిటీ, సిటీ హాస్పిటల్‌ రెస్పిరేటరీ రీసెర్చ్‌ యూనిట్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

ఆరోగ్యవంతుల, రోగుల లాలాజలాలపై వేర్వేరుగా చేపట్టిన లిక్విడ్‌ క్రొమటోగ్రఫీ–మాస్‌ స్పెక్రోమెట్రీ పరీక్షల ఫలితాలను విశ్లేషించి శాస్త్రవేత్తలు ఆస్తమాను నిర్ధారించగలిగారు. ఈ పరీక్ష ద్వారా వ్యాధి తీవ్రత, అభివృద్ధిని అంచనావేయవచ్చు.

>
మరిన్ని వార్తలు