హల్ చల్ చేస్తున్న 'డాడా-డింగ్'..!

28 Jul, 2016 16:38 IST|Sakshi
హల్ చల్ చేస్తున్న 'డాడా-డింగ్'..!

దాదాపు పదిహేను రోజుల క్రితం కొత్తగా రిలీజైన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నైక్ కమర్షియల్ ఫీచరింగ్ యాక్టర్ దీపికా పదుకొనె సహా 10 మంది భారత క్రీడాకారిణులు నటించిన యాడ్.. వైరల్ గా మారింది. ఇది.. కేవలం పురుష ప్రపంచమే కాదని, మహిళల్లోనూ మహామహులు ఉన్నారని ఈ కొత్త యాడ్ నిరూపిస్తోంది. గ్రామీణ ప్రాంతాలనుంచీ వచ్చినా... గట్టి పోటీని ఎదుర్కొని గగనతలాలను తాకిన మహిళా సాధికారతను ప్రపంచానికి చాటుతోంది.

స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం నైక్.. రూపొందించి, తాజాగా విడుదల చేసిన బెస్ట్ కమర్షియల్ యాడ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ మహమ్మద్ రిజ్వాన్ సృజనాత్మకత ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది.  డాడా-డింగ్ అనే టైటిల్ తో విడుదలైన యాడ్ లో 12 మంది క్రీడాకారిణులతోపాటు.., వారి ఫిట్ నెస్ ట్రైనర్లు అదరహో అనిపించారు.  3 నిమిషాల నిడివితో ఉన్న యాడ్.. గ్రామీణ మహిళా శక్తిని సాక్షాత్కరిస్తోంది. గ్రామీణ మహిళలు డైలీ లైఫ్ లో ఎంత కష్టిస్తారో ఈ వీడియో  ప్రత్యక్షపరుస్తోంది. శతాబ్దాలుగా నాలుగ్గోడల మధ్యా ఎటువంటి గుర్తింపూ లేకుండా  మిగిలిపోతున్న మహిళా శక్తిని ప్రతిబింబింస్తూ ఈ ప్రకటన రూపొందింది. దీన్ని మహిళలకు అంకితమిస్తూ.. దర్శకుడు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన కొద్ది రోజులకే ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

క్రికెటర్ హర్మాన్ ప్రీత్ కౌర్, హాకీ ప్లేయర్ రాణి రాం పాల్, ఫుట్ బాల్ ప్లేయర్ తన్వీ హంస్, మరో క్రికెటర్ స్మృతి మంధనా, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప, ఫుట్ బాలర్ జ్యోతి, మరో క్రికెటర్ సుబ్బలక్ష్మి శర్మతో పాటు, స్ప్రింటర్ శ్వేతా హక్కే పర్సనల్ ట్రైనర్ శ్వేతా సుబ్బయ్య, సర్ఫర్ ఇషితా మాలవీయ, ఇన్ స్ల్రక్టర్, నమ్రతా పురోహిత్, ఫిట్ నెస్ ట్రైనర్ అర్మి కొథారె లతో కూడిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. తమ తమ ఆటల్లో  అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్న క్రీడాకారిణులతో రూపొందిన యాడ్.. హల్ చల్ చేస్తోంది.

మరిన్ని వార్తలు