వరుసగా రెండో రోజూ లాభాల్లో మార్కెట్లు | Sakshi
Sakshi News home page

వరుసగా రెండో రోజూ లాభాల్లో మార్కెట్లు

Published Thu, Jul 28 2016 4:22 PM

వరుసగా రెండో రోజూ లాభాల్లో మార్కెట్లు

ముంబై : వరుసగా రెండో రోజు బీఎస్ఈ సెన్సెక్స్, ఎస్ఎస్ఈ నిఫ్టీ లాభాల్లో పయనించాయి. ట్రేడింగ్ చివరిలో ఈక్విటీ బెంచ్ మార్కులు పుంజుకోవడంతో, సెన్సెక్స్ 184.29 పాయింట్లు లాభపడి 28208.62 వద్ద ముగియగా.. నిఫ్టీ 50.50 పాయింట్లు ఎగిసి, 8666.30గా నమోదైంది. ఏషియన్ పేయింట్స్, మారుతీ సుజుకీ, ఐటీసీ, సన్ ఫార్మా, టీసీఎస్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఐషెర్ మోటార్స్ లాభాలు పండించగా.. టాటాస్టీల్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, లుపిన్, టెక్ మహింద్రా, అరబిందో ఫార్మాలు నష్టాలను చవిచూశాయి. మెరుగైన కార్పొరేట్ ఆదాయాలు మార్కెట్ల సెంటిమెంట్ను బలపరుస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అదేవిధంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తొలగిపోతున్నాయని బుధవారం రాత్రి ఫెడ్ ప్రకటించడంతో మార్కెట్లు పుంజుకున్నట్టు తెలిపారు. ఎఫ్ఎమ్సీజీ, ఫార్మా, ఆటో స్టాక్స్ మద్దతుతో మార్కెట్లు ఈ ర్యాలీని కొనసాగించాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఫ్యూచర్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర కూడా బ్యారెల్కు రూ.10లు పెరిగి, రూ.2,841గా నమోదైంది. దీంతో ఆసియన్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు వచ్చాయి. క్యూ1 ఫలితాల ప్రకటనతో ఏషియన్ పేయింట్స్ 6శాతం పైగా ఎగిసి, టాప్ గెయినర్ గా నిలిచింది. అటు కరెన్సీ మార్కెట్ లో డాలర్ తో పోలిస్తే  రూపాయి 0.06 పైసల లాభంతో రూ. 67.09గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10గ్రా. పుత్తడి 223 రూపాయల లాభంతో, 31,209గా ట్రేడ్ అయింది.

Advertisement
Advertisement