సాయంత్రం 5 దాటితే కష్టాలే.. ఆ నగరాల్లో దారుణమైన ట్రాఫిక్‌!

25 Nov, 2023 15:48 IST|Sakshi

నగరాల్లో ట్రాఫిక్‌ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎన్ని పైవంతెనలు వచ్చినా, కూడళ్లను మూసేసినా, యూటర్న్‌లు ఏర్పాటు చేసినా వాహనదారుల కష్టాలు మాత్రం తీరట్లేదు. ఉదయాన్నే ఆఫీసులకు బయల్దేరే ఉద్యోగులు సహా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సమయానికి చేరుకోలేకపోతున్నారు. 

బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్లకు వెళ్లేవారు ప్రయాణ సమయానికి గంట ముందు, విమానాశ్రయానికి వెళ్లేవారు దాదాపు మూడు గంటల ముందే బయల్దేరాల్సి వస్తోంది. సాయంత్రం ఐదు దాటిందంటే నగరంలో ట్రాఫిక్‌ క్రమంగా పెరుగుతూ ఉంటుంది. రాత్రి పది తర్వాతే రోడ్లపై కొంచెం ఒత్తిడి తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రధాన నగరాల్లో ఈ తిప్పలు తప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కష్టాలు చాలవన్నట్లు వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగిపొర్లి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గమ్యం చేరే వరకు గంటల కొద్దీ అలా ప్రయాణం సాగించాల్సిందే. 

ఇదీ చదవండి: ప్రపంచంలో అక్కడే నిరుద్యోగులు ఎక్కువ..!

కేంద్రం అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం.. దాదాపు 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలి. అయినా రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఆటోమొబైల్‌ కంపెనీలు ప్రతి త్రైమాసికంలో వాటి సేల్స్‌డేటా పెరుగుతోందని ప్రకటిస్తున్నాయి. దాంతో రోజూ రోడ్లపై చేరే వాహనాల సంఖ్య పెరుగుతోంది. రోడ్ల వెడల్పు నిర్ణీత ప్రదేశం వరకే విస్తరించే అవకాశం ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఫ్లైఓర్లు వేసి కొంత కట్టడి చేస్తున్నారు. అయినా చాలా నగరాల్లో ట్రాఫిక్‌ తిప్పలు తప్పడంలేదు. 

ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరల కోసం క్లిక్‌ చేయండి

ప్రపంచంలో అత్యధికంగా నైజీరియా దేశంలోని లాగోస్‌ నగరంలో ప్రజలు ట్రాఫిక్‌ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. లాగోస్‌ విస్తీరణం 999 చదరపు కిలోమీటర్లు. అక్కడ ఒక కిలోమీటర్‌కు దాదాపు 227 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. నగరంలోని 9100 రోడ్లపై రోజు దాదాపు 50లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. దేశంలో అధికంగా ట్రాఫిక్‌ ఉండే నగరాల్లో దిల్లీ మొదటిస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉంది. దిల్లీ సుమారు 1484 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. 2020 లెక్కల ప్రకారం దాదాపు 1.2 కోట్లు వాహనాలు దిల్లీలో ఉన్నాయి. దిల్లీ తర్వాత కోల్‌కతా, ముంబయి నగరాల్లో అధికంగా ట్రాఫిక్‌ ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది.

మరిన్ని వార్తలు