వేలానికి కింగ్‌ జార్జి III వాచ్‌

19 Jun, 2020 18:32 IST|Sakshi

లండన్‌: రాజులు వాడిన వస్తువులను, అప్పుడు వాడుకలో ఉన్న అలంకార వస్తువులను, రాజుల చరిత్రను తెలిపే మాన్యుస్క్రిప్ట్‌లను కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. వీటిని కోట్లు కుమ్మరించి కొనుక్కుంటూ ఉంటారు. త్వరలో ప్రముఖ ఆక్షన్‌ కంపెనీ సోథెబే.. కింగ్‌ జార్జి III కోసం తయారుచేసిన అత్యంత విలువైన గడియారాన్ని,  హొరాషియో నెల్సన్, ఎమ్మా హామిల్టన్ కు రాసిన ప్రేమలేఖలు, మొదటి ప్రపంచ యుద్దం నాటి ఆల్బమ్‌ వీటన్నింటిని వేలం వేయనుంది. వీటి విలువ 5 మిలియన్‌ పౌండ్ల కంటే ఎక్కువ ధర పలికే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా కింగ్‌ జార్జి III, నెపోలియన్‌ కాలం నాటివి ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒకే వ్యక్తి దగ్గర ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన బంగారు గడియారాన్ని ప్రముఖ వాచ్‌మేకర్‌ అబ్రహం-లూయిస్ బ్రెగ్యూట్ 1808లో జార్జ్ III కోసం తయారు చేశారు. ఇది దాదాపు మిలియన్‌ డాలర్లు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. (సహాయం కోసం వేలం)

జి అండ్‌ ఆర్‌ అనే అక్షరాలతో చెక్కబడిన ఒక ప్లేట్‌ ఉంది. ఇది బ్రుగెట్‌ సృష్టించిన వాటిలో ప్రత్యేకమైనది. దానిని అప్పట్లో 4,800 ఫ్రెంచ్‌ ఫ్రాంక్‌లకు అమ్మారు. ఆ సమయంలో భారీ మొత్తాన్ని చెల్లించడంలో రాజు విఫలమయ్యాడు. ఈ వేలంలో లభించనున్న మరో ముఖ్యమైన వస్తువులలో ఒకటి కింగ్‌ నెల్సన్‌ తన ప్రేయసి హామిల్టన్‌కు రాసిన 100కు పైగా ప్రేమ లేఖలు ఉన్నాయి. వీటిలోని ఒక లేఖలో తన బాధను వ్యక్తపరుస్తూ.. ‘నేను ఆనందంగా లేను, మనం దూరంగా ఉండటం నాకు బాధను మాత్రమే మిగులుస్తుంది’ అని రాసివుంది. దీనికి 12000 పౌండ్ల వరకు పలికే అవకాశముందని అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు మొదటి ప్రపంచానికి సంబంధించిన అనేక సందేశాలు, డ్రాయింగ్‌లు, కవితలు ఉన్న బ్రిటీష్‌ ఆల్బమ్‌ ఒకటి ఉంది. వీటితో పాటు మరెన్నో విలువైన వస్తువులు ఈ వేలంలో లభించనున్నాయి. జూలై 8-15 వరకు ఈ వేలం నిర్వహించనున్నారు. (వేలానికి రాహుల్‌ ప్రపంచకప్‌ బ్యాట్‌)

మరిన్ని వార్తలు