గాలిలో అతలాకుతలమైన విమానాలు.. వైరల్‌ వీడియో

22 Jan, 2018 13:55 IST|Sakshi

డసెల్‌డార్ఫ్‌(జర్మనీ) : యూరప్‌ను వణికించిన శక్తిమంతమైన తుపాను ఫ్రెడరిక్‌ ఎట్టకేలకు శాంతించింది. భారీ వర్షాలు, భీకర గాలులతో అతలాకుతలమైన జర్మనీ, నెదర్లాండ్స్‌, బెల్జియం తదితర దేశాలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయి. 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీడయంతో దెబ్బతిన్న రవాణా, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను సిబ్బంది పునరుద్ధరిస్తున్నారు. తుపాను ధాటికి తొమ్మిది మంది మరణించగా, భారీగా ఆస్తినష్టం జరిగింది.

వైరల్‌ వీడియో : ఫ్రెడరిక్‌ తుపాను సృష్టించిన బీభత్సం తాలుకు వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జర్మనీలోని ప్రఖ్యాత డసెల్‌డార్ఫ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రాస్‌విండ్‌ ల్యాండింగ్‌ వీడియో ఒకటి వైరల్‌ అయింది. రన్‌వేపై ల్యాండ్‌ కావాల్సిన విమానాలు.. గాలిలోనే అతలాకుతలమైన దృశ్యాలను ఓ వీడియో గ్రాఫర్‌ తన కెమెరాలో చిత్రీకరించాడు. అంత ప్రతికూల పరిస్థితుల్లోనూ చాకచక్యంగా విమానాలను ల్యాండ్‌ చేసిన పైలట్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

వణికిన విమానాలు వీడియో

మరిన్ని వార్తలు