గగన్‌యాన్‌...

19 Jan, 2020 04:50 IST|Sakshi

ఆస్ట్రోనాట్స్‌.. అంతరిక్ష యాత్రికులు, వీరిని వ్యోమగాములని కూడా పిలుస్తాం. మన గగన్‌యాన్‌ మిషన్‌ కోసం రష్యాలో శిక్షణ తీసుకునే వ్యోమగాముల్ని గగన్‌నాట్స్‌ అని ముద్దుగా పిలుస్తున్నారు. వీరిని అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లి తిరిగి భూమికి సురక్షితంగా తీసుకొచ్చే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అడుగులు వేస్తోంది. ఈ మిషన్‌ కోసం తొలుత 12 మంది ఎంపిక చేసింది. భారత్‌లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరో స్పేస్‌ మెడిసిన్‌ (ఐఏఎం)లో వారికి కొన్ని పరీక్షలు నిర్వహించి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న నలుగురిని తుది జాబితాలోకి చేర్చింది. ఈ నలుగురిలో మహిళలెవరికీ చోటు దక్కలేదు. ప్రస్తుతానికి వీరి వివరాలను ఇస్రో రహస్యంగా ఉంచింది. అయితే వీరంతా భారత వైమానిక దళానికి చెందిన పైలట్లని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ వెల్లడించారు. మానవ లక్షణాలు కలిగిన ఒక రోబోని కూడా వ్యోమగాముల వెంట పంపించనున్నారు. 

గగన్‌యాన్‌ ఎప్పుడు: భారత్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2022లో అంతరిక్షంలోకి అడుగు పెట్టాలని లక్ష్యం
తుది జాబితాలో వ్యోమగాములు: నలుగురు
రష్యాలో శిక్షణ ఎంతకాలం: 11 నెలలు
వ్యయం: రూ.10 వేల కోట్లు
అంతరిక్ష కేంద్రానికి వెళ్లే వ్యోమగాములు: ఇద్దరు లేదా ముగ్గురు 
గడిపే కాలం: వారం రోజులు 
వ్యోమగాముల్ని తీసుకువెళ్లే వాహకనౌక: బాహుబలి జీఎస్‌ఎల్వీ మార్క్‌–త్రీ 

మరిన్ని వార్తలు