డబ్ల్యూటీవోలో భారత్‌కు చుక్కెదురు

5 Jun, 2015 01:50 IST|Sakshi

జెనీవా/వాషింగ్టన్: అమెరికా నుంచి కోడిమాంసం, గుడ్లు, పందుల దిగుమతులను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై డబ్ల్యూటీవోలో చుక్కెదురైంది. దీనికి సంబంధించిన కేసును ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద భారత్ ఓడిపోయింది. భారత్ నిర్ణయం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం లేదని డబ్ల్యూటీవో అప్పీలేట్ తేల్చి చెప్పింది. తమ తీర్పును అమలు చేసేందుకు భారత్‌కు 12 నుంచి 18 నెలల సమయం ఇచ్చిన అప్పీలేట్ ఆ తరువాత అమెరికా భారత్‌కు ఆయా ఉత్పత్తులను ఎగుమతి చేయొచ్చని స్పష్టం చేసింది.

బర్డ్ ఫ్లూకు సంబంధించి భారత్ నిబంధనలు సరిగా లేవని పేర్కొంది. అమెరికా దిగుమతుల నిషేధం సరికాదంటూ గత సంవత్సరం డబ్ల్యూటీవో కమిటీ ఇచ్చిన తీర్పు సరైనదేనని అప్పీలేట్ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు