భలే ఉందే ఈ బిల్డింగ్‌..

6 May, 2018 01:58 IST|Sakshi

ఫొటో చూడగానే అందరికీ చిత్రంగా అనిపిస్తుంది. 

ఈ భవనమే కాదు.. దీని వెనుక ఉన్న ఐడియా కూడా సూపర్‌. పైర్‌పాలో లాజరానీ అనే ఇటాలియన్‌ డిజైనర్‌ సముద్రంపై ఇలాంటి పిరమిడ్‌ ఆకారపు ఇళ్లు, నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదిస్తున్నాడు. ఇళ్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పంటలు పండే గ్రీన్‌హౌస్‌లు, హోటళ్లు, సినిమాలు ఇలా బోలెడన్ని భవనాలను ఒకదగ్గర చేర్చి.. ఓ కొత్త నగరాన్ని కట్టేయాలన్నది లాజరానీ ఆలోచన. దీనికి ఆయన పెట్టిన పేరు.. ‘వాయాల్యాండ్‌’. ఒక్కో భవనాన్ని వాయా అని పిలుస్తారు. ఫైబర్‌గ్లాస్, కార్బన్లు, ఉక్కుతో తయారయ్యే ‘వాయా’లను మాయన్, జపనీస్‌ ఆర్కిటెక్చర్‌ ఆధారంగా డిజైన్‌ చేశారు.

అన్నింటిపై వీలైనంత ఎక్కువ ప్రదేశంలో సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటై ఉంటాయి. వీటితోపాటు వాటర్‌ టర్బయిన్ల ద్వారా కూడా కరెంటు ఉత్పత్తి అవుతుంది. అవసరమైనప్పుడు ఒక చోటి నుంచి మరోచోటికి వాయాలను తరలించేందుకు మోటార్లు కూడా ఉంటాయి. ఒక్కో వాయా (చిన్నసైజులో ఉండేది) ఖరీదు దాదాపు రూ.రెండున్నర కోట్ల వరకూ ఉంటుందని అంచనా. వాయాల్యాండ్‌ నిర్మాణం కోసం లాజరానీ నిధులు సేకరిస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే 2022 నాటికి ఏదో ఒక మహా సముద్రంలో దీనిని నిర్మిస్తానని చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు