అతిపెద్ద మానవరహిత నౌక

4 May, 2016 01:38 IST|Sakshi
అతిపెద్ద మానవరహిత నౌక

శాన్ డియాగో(అమెరికా): డ్రోన్లు, డ్రైవర్ లేని కార్లలాగానే కెప్టెన్లు లేకుండా ప్రయాణించే నౌకలు వచ్చేస్తున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద మానవరహిత నౌకను పెంటగాన్‌లో మంగళవారం ప్రదర్శించారు. 132 అడుగులున్న ఈ నౌక... నీటి లోపలున్న జలాంతర్గాములను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది 10,000 నాటికల్ మైళ్ల వరకు ప్రయాణించగలదని సైనిక పరిశోధన విభాగం డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ తెలిపింది. నౌకను రెండు సంవత్సరాల పాటు శాన్‌డియాగో తీరంలో పరీక్షించనున్నారు.

మరిన్ని వార్తలు