2025 నాటికి సూపర్ రిచ్ సిటీలు ఇవే

1 May, 2016 12:11 IST|Sakshi
2025 నాటికి సూపర్ రిచ్ సిటీలు ఇవే

ప్రపంచంలోనే రిచ్చెస్ట్ సిటీ ఏది? టోక్యో, ఆ తర్వాత న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, సియోల్, లండన్, పారిస్.. ప్లీస్ హోల్డాన్! మరో పదేళ్లలో ఈ జాబితా తలకిందులు కానుంది. మోస్ట్ ఎమర్జింగ్ సిటీలుగా అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న కొన్ని నగరాలు న్యూయార్క్, లండన్, టోక్యోలను అధిగమించి 2025 నాటికి సూపర్ రిచ్ సిటీలుగా అవతరించనున్నాయి. పలు అధ్యయనాలు అనంతరం ప్రఖ్యాత మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ  మెకిన్సే అండ్ కంపెనీ ఫ్యూచర్ రిచ్ సిటీల జాబితాను రూపొందించింది. ఆ జాబితాలోని ఏడు నగరాల ఫొటోలు, వివరాలు మీకోసం..

(ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

 

. దోహా- ఖతార్: ఇప్పటికే సంపన్న నగరంగా ఉన్న దోహా అద్భుతమైన జీడీపీ వృద్ధి రేటుతో 2025నాటికి రిచ్చెస్ట్ సిటీల్లో ఒకటిగా అవతరిస్తుంది.  
2. బెర్గన్- నార్వే: ఎనర్జీ ఇండస్ట్రీ, షిప్పింగ్, మెరైన్ పరిశోధనల్లో తనదైన ముద్రతో నార్వే ఆర్థిక రంగానికి వెన్నెముకగా ఉన్న బెర్గన్ మరో పదేళ్లలో సూపర్ రిచ్ సిటీ అవుతుంది.
3. ట్రొన్హెయిమ్- నార్వే: మొబైల్ టెక్నాలజీకి పుట్టినిల్లయిన ట్రొన్హెయిమ్.. నార్వేలోని మరో ముఖ్యనగరం. స్టార్ట్ అప్ ల హబ్ గా 2025లోగా ఇది ధనిక నగరంగా అవతరించనుంది.
4. హ్వాసియోంగ్- దక్షిణ కొరియా: శాంసంగ్, ఎల్ జీ, హ్యుందాయ్ కపెనీల జన్మస్థానమైన ఈ నగరం మరికొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలో ధనిక నగరం కానుంది.
5. అసాన్- దక్షిణ కొరియా: సమీప భవిష్యత్ లో గ్లోబల్ షిప్పింగ్ హబ్ గా అవతరించనున్న అసాన్ కూడా రిచ్చెస్ట్ సిటీ రేస్ లో దూసుకుపోతోంది.
6. రైన్ రుహ్ర్- జర్మనీ: యూరప్ లోని అతిపెద్ద నగరాల్లో మూడో స్థానం(ఫస్ట్ లండన్, సెకెండ్ పారిస్) లో ఉన్న జర్మన్ మెగాసిటీ రైన్ రూహ్ర్ ధనిక నగరంగా అవతరించడం ఎంతోదూరంలోలేదు.
7. మకావు- చైనా: అతితక్కువ కాలంలో బీభత్సంగా అభివృద్ధి చెందిన చైనా నగరం మకావు.. గతేడాది ఆర్థిక సంక్షోభాన్ని చవిచూసినా 2025 నాటికి రిచ్చెస్ట్ సిటీ అవుతుందని అంచనా.

 

 

మరిన్ని వార్తలు