అర కిలోమీటర్‌ ఎత్తులో ఈడ్చుకుంటూ..

11 Mar, 2018 15:29 IST|Sakshi

బీజింగ్‌ : గాజు వంతెలనకు పెట్టింది పేరు చైనా. సాధారణ వంతెనల నిర్మాణం కంటే ఇప్పుడక్కడ ఎత్తయిన కొండ ప్రాంతాల్లో కొండ చివరన గాజువంతెనల నిర్మాణమే అధికం. ఎందుకంటే ఇవి విపరీతంగా టూరిస్టులను ఆకర్షించి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అయితే, అక్కడికి వచ్చిన టూరిస్టులు మాత్రం చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదుర్కొంటున్నారు. వంతెన వరకు వచ్చి దానిపై అడుగుపెట్టేందుకు భయపడేవారు కొందరైతే.. దానిపై  కొంతమేరకు నడిచి అంత ఎత్తునుంచి కిందికి చూసి కళ్లు తిరిగి ఇక మాత్రం ముందుకు కదలకుండా వంతెనకు వేలాడేవారు ఇంకొందరు.

తాజాగా ఓ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చెక్కర్లు కొడుతోంది. ఇటీవల ప్రారంభించిన ఐజాయ్‌ అనే 500 మీటర్ల ఎత్తయిన గాజు వంతెనపై కొద్ది దూరం మాత్రం రెండడుగులు వేసిన ఓ మహిళా టూరిస్టు అనంతరం గజగజా వణికిపోతూ దానిపై కూర్చొని ఇక కదలలేనంటూ మొండికేసింది. దీంతో ఆమెతో వచ్చిన వ్యక్తి ఈడ్చుకుంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన అక్కడి వారంతా కడుపుబ్బేలా నవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ వీడియో తెగ ఆకర్షిస్తోంది.. మీరూ ఓ లుక్కేయండి మరీ!

మరిన్ని వార్తలు