ట్విటర్‌ సంచలన నిర్ణయం

31 Oct, 2019 09:37 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో అన్ని రాజకీయ ప్రకటనలపై నిషేధం

నవంబరు 22 నుంచి ఈ నిషేధం అమల్లోకి

పూర్తి వివరాలు నవంబరు 15న వెల్లడిస్తాం  - ట్విటర్‌ సీఈవో

సోషల్‌మీడియా దిగ్గజం ట్విటర్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఫేక్‌న్యూస్‌, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలు, రాజకీయ ప్రకటనలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అన్ని రాజకీయ ప్రకటనలను తన వేదిక నుండి నిషేధించింది.  వచ్చే నెల నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. 

తన వేదికపై రాజకీయ ప్రకటనలను నిషేధిస్తుందని ట్విటర్‌ చీఫ్ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే బుధవారం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో అన్ని రాజకీయ ప్రకటనలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాము. రాజకీయ సందేశాలు ప్రజలకుచేరాలి తప్ప కొనకూడదు" అని డోర్సే ట్వీట్ చేశారు. ఈ విధానం గురించి మరిన్ని వివరాలను నవంబర్ 15న వెల్లడిస్తామని, నవంబర్ 22 వ తేదీ నుంచి  అన్ని రాజకీయ ప్రకటనలను అంగీకరించడం మానేస్తామని డోర్సే చెప్పారు. మరోవైపు ట్విటర్‌ తీసుకున్న ఈ నిర్ణయం డెమొక్రాట్ల ప్రశంసంలందుకోగా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార కమిటీ  అపహాస్యం చేయడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు