ఫ్లోరిడాలో యాంటీ మాస్క్‌ ప్రచారం..

26 Jun, 2020 13:00 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్న తరుణంలో ముఖానికి మాస్కులు ధరించడం అత్యంత ఆవశ్యకంగా మారింది. నేడు రోడ్డుపై ఎక్కడ ఎవరిని చూసిన మూతికి మాస్కుతోనే కనిపిస్తున్నారు. ఈక్రమంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో యాంటీ మాస్క్‌ పేరుతో  కొంత మంది వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. మాస్కులు ధరించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాస్కును ధరించడం వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతింటుందని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే కారణాలను ఎత్తి చూపుతున్నారు. ష్లోరిడాలో బీచ్‌ కౌంటీ కమిటీ పేరుతో వైద్యులు, వైద్య నిపుణులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాస్కును ధరించకుండా ఉండేందుకు అనేక కారణాలను వాదిస్తున్నారు. (భారత్‌కు అండగా అమెరికన్‌ బలగాలు)

మానవ శ్వాసను నియంత్రించే అధికారాన్ని తమకు ఎవరిచ్చారని, ఎక్కడ పొందారని ఓ యాంటీ మాస్క్‌ ప్రచారకుడు ప్రశ్నించాడు. ‘నేను ఎప్పుడూ లోదుస్తులు ధరించను. అలాగే మాస్కు కూడా ధరించను’ అంటూ కమిటీ ముందు మరో ప్రచారకుడు చెప్పాడు. ‘ప్రకృతిని ఆస్వాధించేందుకు దేవుడు మనకు అద్భుతమైన శ్వాస వ్యవస్టను ఇచ్చాడు. మీరందరూ దానిని విస్మరించాలనుకుంటున్నారు. మాస్కును ధరించాలని బలవంతం చేసిన వారందరినీ అరెస్టు చేస్తాం’ అని చెబుతున్నారు. మానవ హక్కులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కౌంటీకి హాజరైన వైద్యులు, వైద్య నిపుణులను అరెస్టు చేస్తామని ప్రచారకులు పేర్కొన్నారు. (భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు)

అయితే మాస్కును ధరించడం వల్ల ప్రాణాలకు హానీ కలుగుతుందని యాంటీ మాస్క్‌ ప్రచారకులు భావిస్తున్నప్పటికీ ఇది వాస్తవానికి పూర్ది విరుద్ధమని నిపుణులు పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌ బారి నుంచి తప్పించుకునేందుకు మాస్క్‌ ధరించడం తప్పనిసరి అంటున్నారు. ఇక కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు యూఎస్‌లోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే  దాదాపు 25 లక్షల కేసులు నమోదవ్వగా వైరస్‌తో 1,26,000 మంది మృత్యువాతపడ్డారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 10 మిలియన్ల మార్కును చేరబోతున్నాయి. (నాడు సరితా కోమటిరెడ్డి.. నేడు విజయ్‌ శంకర్‌!)

మరిన్ని వార్తలు