లాప్‌టాప్‌ ముందు భర్త.. డాన్స్‌ చేస్తున్న భార్య

30 May, 2020 14:06 IST|Sakshi

విచిత్ర వేషధారణలో మహిళ డాన్స్‌.. ఎందుకంటే..

ఇంట్లో వాళ్లతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నామని బాధపడే ఉద్యోగులకు ‘లాక్‌డౌన్‌’ అద్భుత అవకాశాన్ని కల్పించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మెజారిటీ సంస్థలు ‘వర్క్‌ ఫ్రం హోం’సదుపాయాన్ని కల్పించడంతో చాలా మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంటి భోజనం తింటూ వేళకు నిద్రపోతూ క్వాలిటీ టైం గడుపుతున్నారు. ఇది లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తొలినాళ్లలోని పరిస్థితి.

కానీ మెల్లమెల్లగా సీన్‌ రివర్స్‌ అయింది. పవర్‌ కట్‌, ఇంటర్నెట్‌ సమస్యలు, వరుస వీడియో కాల్స్‌(ఆఫీస్‌ వర్చువల్‌ మీటింగ్‌), అధిక పనిభారం కారణంగా వర్క్‌ ఫ్రం హోం కంటే ఆఫీస్‌లో కూర్చుని పని చేసుకోవడమే బెటర్‌ అనే భావనలో ఉన్నారు. అంతేకాదు వర్క్‌ ఫ్రం హోం వల్ల శారీరక శ్రమ తగ్గడం, వ్యాయామం చేయకుండా బద్ధకంగా తయారవడం, ఇష్టమైన ఫుడ్‌ లాగించేయడంతో బరువు పెరుగుతుండటంతో మానసికంగా ఒత్తిడి లోనవుతున్నారు.(పాపం బాలిక: లిఫ్ట్‌లో భయంకర క్షణాలు)

ఇక ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఒకరు ‘వర్క్‌ ఫ్రం హోం’లో నిమగ్నమైనా.. మిగతా వాళ్లంతా కలిసి టీవీ చూస్తూనో, ముచ్చట్లు పెట్టుకుంటూనో టైం గడిపేస్తారు. అలా కాకుండా కేవలం భార్యాభర్తలే ఉన్న ఇంట్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంటుందంటున్నారు జొహానా ఓర్టెగా అనే మహిళ. భర్త ఎప్పుడూ లాప్‌టాప్‌ ముందే కూర్చోవడంతో తనకు బోర్‌ కొడుతోందంటూ ఓ ఫన్నీ వీడియోను షేర్‌ చేశారు. తనను తాను ఎంటర్టేన్‌ చేసు​కోవడం కోసం విచిత్ర వేషధారణలో డాన్స్‌ చేస్తూ భర్తను ఆటపట్టిస్తూ... ‘‘మీ భర్త పనిచేస్తుండగా.. మీరు ఖాళీగా ఉంటే. క్వారంటైన్‌ లైఫ్‌లో నేనిలా ’’అనే క్యాప్షన్‌తో టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేశారు. జోహానా వీడియోకు ఇప్పటికే దాదాపు 3 మిలియన్ల లైకులు రాగా.. వేల కొద్దీ కామెంట్లు, లక్షల్లో షేర్లతో దూసుకుపోతోంది.(మాజీ ప్రియుడి నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా