ఫేస్బుక్ సీఈవోపై సంచలన ఆరోపణలు

7 Jun, 2016 13:40 IST|Sakshi
ఫేస్బుక్ సీఈవోపై సంచలన ఆరోపణలు

ఫేస్బుక్ సీఈవో, వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్పై ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఆంటోనియో గార్సియా మార్టినెజ్ సంచలన ఆరోపణలు చేశారు. గూగుల్ ప్లస్ను నాశనం చేయాలని జూకర్బర్గ్ భావించారని బాంబు పేల్చారు. మార్టినెజ్.. 'చావోస్ మంకీస్: ఆబ్సెన్ ఫార్చూన్ అండ్ రాండమ్ ఫెయిల్యూర్ ఇన్ సిలికాన్ వ్యాలీ' పేరిట ఓ పుస్తకం రాశారు. త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించారు.

2011లో గూగుల్ ప్లస్ వెబ్సైట్ను ప్రారంభించినపుడు దాని అస్థిత్వాన్ని దెబ్బతీయాలని జూకర్బర్గ్ యోచించారని మార్టినెజ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. గూగుల్ కూడా ఫేస్బుక్ విషయంలో మొదట్లో ఏమాత్రం ప్రాధాన్యం ఇచ్చేదికాదని ఆయన వెల్లడించారు. గూగుల్, ఫేస్బుక్ సంస్థలకు సంబంధించిన విషయాలు, వాటి మధ్య పోటీతత్వంతో పాటు ఐటీ నిపుణుల ఉద్యోగ అవకాశాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఫేస్బుక్కు కౌంటర్గా గూగుల్ ప్లస్ను  ప్రారంభించాలని గూగుల్ భావించిందని తెలిపారు. కొన్ని విషయాల్లో ఫేస్బుక్తో పోలిస్తే  మెరుగైనదని మార్టినెజ్ అభిప్రాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు