Mark Zuckerberg Knee Surgery: మార్క్‌ జుకర్‌బర్గ్‌ మోకాలికి శస్త్ర చికిత్స..అసలేంటి చికిత్స? ఎందుకు?

6 Nov, 2023 15:30 IST|Sakshi

మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ సమయంలో మోకాలికి గాయం అవ్వడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అసలు మోకాలి గాయం అంటే ఏంటీ? ఎందువల్ల అవుతుంది తదితరాల గురించే కథనం.

మోకాలి గాయం అంటే..
క్రీడాకారులు ఎక్కువగా ఈ మోకాలి గాయం బారిన పడతారు. మోకాలి గాయాన్ని పూర్వ క్రూసియేట్ లిగ్మెంట్ (Anterior Cruciate Ligament(ACL)) గాయం అని కూడా అంటారు. అంటే మోకాలి ఏసీఎల్‌ నిర్మాణంపై ఏర్పడిన గాయంగా కూడా చెబుతారు. ఈ ఏసీఎల్‌ అనేది మోకాలిలో ఉండే మృదువైన కణజాల నిర్మాణం. ఈ క్రూసియేట్‌ లిగ్‌మెంట్‌ తొడను ముందు ఎముక(టిబియా)తో కలిపే జాయింట్‌. దీనివల్లే మనం నిలబడటానికి నుంచొవడానికి వదులుగా మోకాలు కదులుతుంది. మనం ముందుకు వంగడానికి, నిలుచున్నప్పుడు కదిలే ఈభాగంలో గాయం అయితే పాపింగ్‌ లాంటి ఒక విధమైన​ సౌండ్‌ వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ ప్రాంతంలో అంతర్లీనంగా లిగ్మెంట్‌ చీరుకుపోవడం లేదా ఎముకలు తప్పి ఒక విధమైన శబ్దం వస్తుంది. దీంతో మోకాలు ఉబ్బి, అస్థిరంగా ఉంటుంది. భరించలేని నొప్పిని అనుభవిస్తాడు పేషెంట్‌. 

A post shared by Mark Zuckerberg (@zuck)

ఏసీఎల్‌ లిగ్మెంట్‌కి చికిత్స ఎలా అందిస్తారంటే..
అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ప్రకారం..దెబ్బతిన్న ఏసీఎల్‌ లిగ్మెంట్‌ స్థానంలో కొత్త ACL గ్రాఫ్ట్ కణజాలంతో భర్తీ చేసి శస్త్ర చికిత్స చేస్తారు. అయితే ఈ కొత్త ఏసీఎల్‌ కణజాలం రోగి నుంచే తీసుకోవచ్చు లేదా మరొకరి నుంచైనా స్వీకరించొచ్చు. ఈ చికిత్స రోగికి తగిలిన గాయం తాలుకా తీవ్రత ఆధారంగా వివిధ రకాలుగా చికిత్స అందిస్తారు వైద్యులు. సాధ్యమైనంత వరకు ఇలాంటి గాయాల్లో తీవ్రత తక్కువగా ఉంటే ఫిజియోథెరపీ చేయించడం, రోగిని రెస్ట్‌ తీసుకోమనడం వంటివి సూచిస్తారు వైద్యులు.

అదే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటే ఏసీఎల్‌ పునర్నిర్మాణ శస్త్ర చికిత్స చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ సాధారణ ఆర్థోస్కోపిక్‌ పద్ధతులను ఉపయోగించే నిర్వహించడం జరుగుతుంది. మోకాలిపై కోతలు పెట్టి పాటెల్లార్‌ స్నాయువుని(మోకాలి చిప్ప), తొడ ఎముకను కొత్త లిగ్మెంట్‌తో జాయింట్‌ చేసేలా మోకాలి అంతటా ఆపరేషన్‌ నిర్వహిస్తారు. ఫలితంగా పటేల్లార్‌ స్నాయువు ముందుకు వెనక్కు కదిలేందుకు ఉపకరిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఆ మోచిప్పలనే తొలగించడం లేదా ఇతర స్నాయువులతో పునర్నిర్మించవడం వంటివి చేస్తారు వైద్యులు. 

(చదవండి: దంతాలకు ఏ పేస్టు బెటర్‌?.. దంత సమస్యలకు కారణం!)

మరిన్ని వార్తలు