లవర్‌లా మాట్లాడేవాడు.. అడిగితే..

20 Dec, 2019 10:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మేమిద్దరం చిన్నప్పటినుంచి ఒకే స్కూల్‌లో చదివాము. ఎనిమిదవ తరగతి చదివేటప్పుడు మాట్లాడుకోవటం మానేశాము. తనంటే నాకు చాలా ఇష్టం. తను నాతో మాట్లాడకపోయినా దూరం నుంచి చూస్తూ నవ్వుకునేదాన్ని. దేవుడు మళ్లీ మమ్మల్ని ఎందుకు కలిపాడో తెలియదు కానీ, ఇంటర్‌ నుంచి మాట్లాడుకోవటమ మొదలుపెట్టాము. తనను నేను ఓ బెస్ట్‌ఫ్రెండ్‌లా చూసేదాన్ని. సంతోషం వేసినా.. దుఃఖం వచ్చినా మొదట అతడికే చెప్పేదాన్ని. తన మెసేజ్‌కోసం ప్రతి క్షణం వెయ్యి కళ్లతో ఎదురు చూసేదాన్ని. కాకపోతే తను ఎప్పుడు నాకు కాల్‌ కానీ, మెసేజ్‌​ కానీ, చేసేవాడు కాదు. తనకు ఏదైనా బాధకలిగితే చేసేవాడు. నేను ఉన్నానని ధైర్యం చెప్పేదాన్ని. తను చాలా మంచివాడు. అందరికి సహాయం చేసేవాడు. రోజులు ఎలా గడిచిపోయాయో.. తనతో ప్రతిక్షణం సంతోషంగా ఉండేది.

మిగితా వాళ్లు మా గురించి తప్పుగా మాట్లాడుకునేవాళ్లు. కానీ, మేము పట్టించుకునేవాళ్లం కాదు. ఎందుకంటే తను నా బెస్ట్‌ ఫ్రెండ్‌. తర్వాత డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నేను నమ్మలేదు.. నిజంగా చెప్పుమని అడిగా. నువ్వులేకపోతే ఉండలేను అన్నాడు. అది అబద్దం అన్నాను. తర్వాత వాళ్ల ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి ‘ నీ వల్ల వాడు పిచ్చివాడు అయిపోతున్నాడు’ అని అన్నాడు. మంచి మనిషి నా జీవితభాగస్వామి అవుతున్నందుకు నేను చాలా సంతోషపడ్డాను. కానీ, ఆ ఆనందం మూడు రోజుల ముచ్చటే అని అర్థం అయ్యింది. నేను అతన్ని‘మనం పెళ్లి చేసుకుందాం’ అని అడిగాను.

తను ‘లవ్‌​ యూ టూ’ అని నాచేతికి రింగ్‌పెట్టాడు. నా ఆనందానికి హద్దులు లేవు. చాలా అదృష్టవంతురాలిని అనుకునేదాన్ని. తర్వాత చెప్పాడు అదంతా డేర్‌ అని. తను నన్ను ఓ ఫ్రెండ్‌లాగా చూశాడని. నా మనసు ముక్కలైపోయింది. మాట్లాడకూడదు అనుకునేదాన్ని. కానీ, నేను మాట్లాడకపోతే పిచ్చివాన్ని అయిపోతాను అన్నాడు. తర్వాత నా మనసు చంపుకుని మాట్లాడేదాన్ని. తనేమో ఒక లవర్‌లా మాట్లాడేవాడు. అడిగితే ఫ్రెండ్‌ అనేవాడు. తనవల్ల నా మనసులో ఇంకెవరికీ చోటివ్వలేకపోయాను.

ప్రేమించిన మనిషి కాదంటుంటే తట్టుకోలేకపోయాను. సూసైడ్‌ చేసుకుందాం అనుకున్నా. మా అమ్మ గుర్తొచ్చి ఆగిపోయా. ప్రతిక్షణం చస్తూ బ్రతికేదాన్ని. తను ఒకసారి నన్ను హగ్‌చేసుకుని ఏడ్చాడు. తనకు అవసరం ఉన్నపుడు నేను కావాలి. నేను ఇప్పటికీ అతన్నే లవ్‌ చేస్తున్నా. తను సిల్లీగా పెట్టిన రింగ్‌ను ఇప్పటికీ తీయలేదు. చావైనా బ్రతుకైనా అతడితోనే. తన దృష్టిలో లవ్‌ అంటే ఓ తప్పు.. నా దృష్టిలో అదో నమ్మకం. మేము భవిష్యత్తులో కలిసుంటామో లేదో తెలియదు. నా చివరి శ్వాస వరకు తనకోసం ఎదురుచూస్తా. 
- అలేఖ్య, తిరుపతి 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

>
మరిన్ని వార్తలు