పెళ్లి కుదిరింది.. ఫోన్ చేయొద్దు!

29 Dec, 2019 10:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మాది నెల్లూరు జిల్లా! నేను వృత్తిరీత్యా సివిల్ కాంట్రాక్టర్.  ఓసారి పని మీద వేరే ఊరికి వెళ్లాను. అక్కడ ఒక అమ్మాయిని చూశాను. తను చాలా అందంగా ఉంది. అంతేకాకుండా ఎదుటివారి పట్ల తను చూపించే గౌరవం నాకు చాలా నచ్చింది. అలా ఆ అమ్మాయిని చూస్తూ చూస్తూ ప్రేమలో పడ్డాను. వాళ్ల ఇంటి దగ్గర్లోనే మేము కూడా ఇల్లుని అద్దెకు తీసుకున్నాము. ఇక అప్పటి నుంచి వాళ్లతో పరిచయం పెరిగింది. అప్పుడప్పుడు వాళ్లింటికి వెళ్లడం వాళ్లతో మాట్లాడడం జరిగేది. ఒక రోజు నేను దైర్యం చేసి తన ఫోన్ నెంబర్ అడిగాను. కానీ, తను ఇవ్వలేదు. ఎలా గోలా నెంబర్ తెలుసుకున్నాను. ఇక అప్పటినుంచి తనతో ప్రతి రోజూ మాట్లాడే వాడిని. కొద్దిరోజులకు తను కూడా నన్ను ఇష్టపడటం మొదలుపెట్టింది. 

ఆ తర్వాత మా ప్రేమ విషయం వాళ్ల ఇంట్లో తెలిసిపోయింది. అయినా తను నాతో మాట్లాడకుండా ఉండేది కాదు. అలా మా ప్రేమ ఆరు నెలల పాటు సంతోషంగా సాగింది. ఆ ఊరిలో వాళ్ల బంధువు అమ్మాయి ఒకరు మా ఇద్దరి గురించి చెడ్డగా ప్రచారం చేసింది. అయినా కూడా తను నాతో మాట్లాడకుండా ఉండేది కాదు. అలా ఒక రెండు నెలల పాటు నాతో చాలా సంతోషంగా ఉండేది. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ తను నాకు ఫోన్ చేయడం మానేసింది.

నేను తనకు ఫోన్ చేస్తే ‘నాకు పెళ్లి కుదిరింది. ఇక ఇప్పటినుంచి ఫోన్ చేయవద్దు’ అని చెప్పింది. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పుడన్నా,ఎక్కడన్నా చూసినా నీ ముఖంలో చిరునవ్వు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే తన పుట్టినరోజు జనవరి 28. కనీసం ఆ రోజైనా తనని చూడాలని అనుకుంటున్నాను. నిరంతరం నీ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను.
 ప్రేమతో... నీ
శ్రీనివాస్

చదవండి : ఓ వైపు అమ్మ.. మరో వైపు ప్రేమ!
ఆస్తి లేదు, అమ్మ లేదు! పిల్లనియ్యం..



లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు