ఆ విషయం తెలిసి షాక్‌ అయ్యాను!

24 Oct, 2019 10:23 IST|Sakshi

అది నేను 10వ తరగతి చదివే రోజులు. అప్పట్లో నేను క్లాస్‌లో చాలా ఆక్టివ్‌గా ఉండేవాన్ని. స్కూల్‌లో కండెక్ట్‌ చేసే ప్రతి ఈవెంట్‌లో నేను పార్టిసిపేట్‌ చేసేవాడిని. స్కిట్స్‌,డాన్స్‌ అన్నిట్లో ఉండేవాడిని. దీంతో నేను స్కూల్లో చాలా ఫేమస్‌. బేసిగ్గా నేను అందరితో బాగా మాట్లాడతాను. గర్ల్స్‌తో కూడా. వాళ్లు కూడా నాతో బాగా మాట్లాడేవారు. అలా మా క్లాస్‌లోని శిరీష అనే అమ్మాయి బాగా పరిచయం అయ్యింది. మొదట స్నేహితుల్లాగా చాలా బాగా మాట్లాడుకునేవాళ్లం. నేనేమో తన మీద బాగా జోక్స్‌ వేసేవాడిని. తను కూడా నా మీద జోక్స్‌ వేసేది. అలా తన మీద నాకున్న ఫ్రెండ్‌ ఫీలింగ్‌ ఒకలాంటి ఫీలింగ్‌గా మారింది! అప్పుడు ఆలోచిస్తే తెలిసింది అది లవ్‌ ఫీలింగ్‌ అని. అలా కొన్ని రోజులు నేను తనని లవ్‌ చేశాను. ఓ రోజు నేను స్కూల్‌కు చాలా తొందరగా వచ్చాను. నాతో పాటు నా సిస్టర్‌(నా క్లాస్‌మేట్‌) కూడా చాలా తొందరగా వచ్చింది. అప్పుడు తను నన్ను అడిగింది ‘‘ నువ్వు శిరీని లవ్‌ చేస్తున్నావా అన్నయ్యా?’’ అని. నేను మొదట లేదని చెప్పాను. కానీ, తర్వాత చెప్పా! ‘అది జస్ట్‌ ఫీలింగ్‌’ అని. తను నమ్మింది. తర్వాత తను చాలా బాధపడింది. ‘ఎందుకు బాధపడుతున్నావ్‌’ అని అడిగాను.

అప్పుడు చెప్పింది. శిరీకి 6వ తరగతిలోనే ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందని. ఆ విషయం తెలిసి నేను షాక్‌ అయ్యాను. తర్వాత రియలైజ్‌ అయ్యి ఆమెను అవాయిడ్‌ చెయ్యటం మొదలుపెట్టాను. ఎందుకంటే ఒక ఎంగేజ్‌మెంట్‌ అయిన అమ్మాయిని ప్రేమించటం తప్పుకదా అని. కానీ, నేను సడెన్‌గా మాట్లాడటం మానేసేసరికి శిరీ చాలా బాధపడింది. ఎందుకంటే! తను కూడా నన్ను ప్రేమిస్తోంది. అది నాకు అప్పుడు తెలియదు. నేను లవ్‌ చేస్తున్న విషయం తనకు తెలియదు. మా ఇద్దరిదీ మూగమనసులు స్టోరీ టైప్‌ అన్న మాట. తను చాలా రోజులు బాధపడింది.. నేనూ బాధపడ్డాను. మా ఇద్దరికీ తెలియదు. ఒకరిగురించి ఒకరం బాధపడుతున్నాం అని. అలా కొన్ని రోజులకు 10వ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయి. అలా ఒకరికొకరం దూరమయ్యాము.
- సుమంత్‌, కాకినాడ ( పేర్లుమార్చాం)

సాక్షి వరల్డ్ ఆఫ్ లవ్: మీ లవ్ స్టోరీని మాతో పంచుకోండి


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు