ఆమె కోసం దేశం విడిచా.. అయినా..

8 Dec, 2019 10:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేను ఉన్నత చదువుల కోసం తమిళనాడులోని ఓ కాలేజీలో చేరాను. ప్రేమ అంటే ఏదో ఒక ఆకర్షణ అనుకున్నా నేను. కానీ, నా ఫైనల్‌ ఇయర్‌లో ఓ అమ్మాయిని చూసిన వెంటనే మనసుకు నచ్చేసింది. తను మా ఫ్రెండ్స్‌తో వెళ్లినపుడు చూశా. మొదటిసారి తనతో మాట్లాడాను. అప్పుడే తను, తను మాట్లాడే తీరు నాకు బాగా నచ్చింది. అలా నా మనసులో ఉన్న ఫీలింగ్స్‌ని మా ఫ్రెండ్‌ సహాయంతో తెలియజేశా. అందరు అమ్మాయిల్లా తను కూడా మొదట్లో నన్ను ఇగ్నోర్‌ చేసింది. కానీ, నేను ప్రపోజ్‌ చేసినపుడు కొన్ని కండీషన్స్‌తో నా లవ్‌ని ఆరు నెలల తర్వాత అంగీకరించింది. అప్పటినుంచి నేను ఏమి చేసినా తన కోసమే చేశాను. నా స్టడీస్‌ అయిపోయిన వెంటనే జాబ్‌లో జాయిన్‌ అయ్యా. తను కూడా నేను కావాలని, నాతోనే ఉండాలని కోరుకుంది. కానీ, అన్ని ప్రేమ కథలకు ఎక్కడ స్టాప్‌ పడుతుందో నాకూ అక్కడే పడింది.

తనకు తన పేరెంట్స్‌ కావాలి, తన పేరెంట్స్‌కు నేను వద్దు. నేను వెళ్లి వాళ్ల డాడీతో మాట్లాడితే ఆయన ఒప్పుకోలేదు. వాళ్లు తమిళ్‌, నేను తెలుగు. ఆ అమ్మాయి కోసం నేను ఇండియా విడిచి వెళ్లా ! త్వరగా సెటిల్‌ అవ్వాలని. తను మాత్రం తన పేరెంట్స్‌కు నన్ను లవ్‌ చేశానని మాత్రం చెప్పలేదు. ఇద్దరి సపోర్ట్‌ ఉంటేనే ఆ లవ్‌ సక్సెస్‌ అవుతుంది. వాళ్లను ఒప్పించటం నా ఒక్కడి వల్ల అవ్వలేదు. 2016లో తను నన్ను వదలి వెళ్లిపోయింది. తన మెమోరీస్‌ మాత్రం నాతోనే ఉన్నాయి. ఎక్కడ ఉందో తెలియదు కానీ, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఎప్పుడూ నవ్వుతూ ఉండు రీతు. ఐ మిస్‌ యూ..
- వీర్రాజు, పిఠాపురం

చదవండి : ఓ రోజు సడెన్‌గా ఫోన్‌ చేసి నేను కావాలంది

ఫ్రెండ్‌గా ఉండలేను.. ఎన్ని రోజులైనా ఇలానే..


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు