వాళ్లే ప్రేమలో సంతోషంగా ఉంటున్నారు

14 Oct, 2019 15:14 IST|Sakshi

కాలిఫోర్నియా : ప్రేమించటం, ప్రేమను పొందటం ఎంత కష్టమో పొందిన ప్రేమను కలకాలం నిలబెట్టుకోవటం కూడా కష్టమే. చాలా కొద్దిమంది మాత్రమే తమ ప్రేమను జీవితాంతం కొనసాగించగలుగుతారు. ప్రేమికులిద్దరూ వేరువేరు వ్యక్తులుగా కాకుండా ‘మేము ఒకటి’ అని భావించుకున్నప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. ప్రేమలో ‘నేను’, ‘నా’ అని కాకుండా ‘మేము’ , ‘మా’ అన్న ధోరణి ఉ‍న్నపుడే ఆ బంధం గట్టిగా ఉంటుందని యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు అంటున్నారు. దాదాపు 5 వేల మంది ప్రేమికులు, పెళ్లైన జంటలపై సైకాలజిస్టులు పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో ముఖ్యంగా ఐదు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. జంట ఎంతకాలం నుంచి కలిసుంటోంది, వారి మానసిక పరిస్థితులు, శారీరక పరిస్థితులు, ప్రతి రోజూ ఒకరికొకరు ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఏ విధంగా వారు మసలుకుంటున్నారు! ఇలా అన్ని కోణాలనుంచి పరిశోధన చేపట్టారు.

సైకాలజిస్టులు అడిగిన ప్రశ్నలకు సంతోషంగా తమ జీవితాని​ గడుపుతున్న జంటలోని వ్యక్తులు సమాధానం చెప్పటానికి మేము, మా అన్న పదాలను ఎక్కువగా ఉపయోగించారు. వ్యక్తిగతంగా కాకుండా జంటగా సమాధానం ఇవ్వటానికే ప్రాధాన్యతనిచ్చారు. తరుచూ గొడవలు పడుతూ ప్రేమగా లేని జంటలోని వ్యక్తులు సమాధానం ఇచ్చేప్పుడు ‘నా’ అన్న పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు. సింగిల్‌గా సమాధానం ఇ‍వ్వటానికే సుముఖత వ్యక్తం చేశారు. కాగా, అంతకు ముందు మాట్రెస్‌ అడ్వైజర్‌ ఓ సర్వేను జరిపింది. ఈ సర్వేలో భాగంగా వెయ్యి మందిని ప్రశ్నించారు. మూడు నెలల వివాహ జీవితంలో మగవారు నగ్నంగా తమ పడక గదుల్లో తిరగటానికి మొహమాటపడటంలేదని, ఆడవాళ్లు ఒక నెల అటు ఇటుగా ఉంటున్నారని తేలింది. కలిసి స్నానం చేసే విషయంలో మగవాళ్లు 4 నెలలు, ఆడవాళ్లు 6 నెలల సమయం తీసుకుంటున్నారని వెల్లడైంది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు