ప్రేక్షకులు నిరుత్సాహపడరు

11 Dec, 2017 01:43 IST|Sakshi

‘‘యానిమేటర్‌గా దాదాపు 400 ఎపిసోడ్స్‌ చేసిన నేను ఇప్పుడు డైరెక్షన్‌ చేస్తున్నాను. తెలుగు సినిమా స్క్రీన్‌పై ఇప్పటి వరకూ ‘ఇ ఈ’ వంటి కథ రాలేదు. ఆ విషయాన్ని గర్వంగా చెప్పగలను’’ అని  దర్శకుడు రామ్‌ గణపతిరావు అన్నారు. నీరజ్‌ శ్యామ్, నైరా షా జంటగా ఆయన దర్శకత్వంలో లక్ష్మణరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల చేస్తున్నారు. లక్ష్మణ్‌రావు  మాట్లాడుతూ–‘‘కొత్త కథ చూడాలనుకునే ప్రేక్షకుల్ని తప్పకుండా మా చిత్రం ఎంటర్‌టైన్‌ చేస్తుంది. సెన్సార్‌ సభ్యుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చినందుకు చాలా హ్యాపీ’’ అన్నారు.

‘‘ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్, లవ్‌ అంశాలతో రూపొందిన చిత్రమిది. టాలీవుడ్‌లో తప్పకుండా కొత్త చిత్రం అవుతుంది. మదర్‌ సెంటిమెంట్, ఎమోషన్స్‌ ఉంటాయి. తప్పకుండా కంటతడి పెట్టుకుంటారు. సీనియర్‌ నటుడు సుధాకర్‌గారు చాలా మంచి పాత్ర చేశారు. ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరచదు’’ అన్నారు రామ్‌ గణపతిరావు.  ‘‘కొత్తవాలమైన మేము చేసిన ‘ఇ ఈ’ ట్రైలర్‌కు 1.5 మిలియన్‌ వ్యూస్‌ రావడం చిన్న విషయం కాదు. ట్రైలర్‌ అంతగా వైరల్‌ అయింది’’ అన్నారు నీరజ్‌ శ్యామ్‌. నైరా షా, సంగీత దర్శకుడు కృష్ణచేతన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు