రానా బర్త్‌డేకి జపాన్‌ నుంచి కానుకలు

15 Dec, 2018 14:16 IST|Sakshi

బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచటం మాత్రమే కాదు.. ఆ సినిమాలో నటించిన నటీనటుల స్థాయిని  కూడా ఎన్నో రెట్లు పెంచింది. ముఖ్యంగా ఈ సినిమాతో ప్రభాస్‌, రానాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇటీవల బాహుబలి జపార్‌ లో రిలీజ్‌ అయిన సందర్భంగా అక్కడి అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. వారిని మరింత ఉత్సాహపరిచేందుకు చిత్రయూనిట్‌ జపాన్‌లో పర్యటించి వారితో సరదాగా గడిపారు.

మన రానాను తమ వాడిగా ఓన్‌ చేసుకున్న జపాన్‌ అభిమానులు రానా పుట్టిన రోజు సందర్భంగా భారీగా గిఫ్ట్‌లను పంపించారు. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ఆఫీస్‌కు 19 గిప్ట్‌ పార్సిల్‌ వచ్చినట్టుగా నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. జపాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ మూవీ ట్విన్‌ ద్వారా ఈ పార్సిల్స్‌ వచ్చినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం హాథీ మేరి సాథీ సినిమాలో నటిస్తున్న రానా చేతిలో మరిన్ని బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.


మరిన్ని వార్తలు