విలువలున్న సినిమాలే తీస్తాను..!

29 Jun, 2014 00:50 IST|Sakshi
విలువలున్న సినిమాలే తీస్తాను..!

 ‘‘సత్యం, మార్గం, లక్ష్యం, నమ్మకం... వీటినే ఆయుధాలుగా చేసుకొని ఐదుగురు యువకులు చేసిన పోరాటమే ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. యువతరం తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పే సినిమా ఇది’’ అని ప్రేమ్‌కుమార్ పట్రా అన్నారు. ఆయన సమర్పణలో క్రాంతి, తనిష్క్, క్రాంతికుమార్, వాసు, కృష్ణతేజ ప్రధాన పాత్రలు, వెంకట్, అస్మితాసూద్ ప్రత్యేక పాత్రలు పోషించిన చిత్రం ‘ఆ అయిదుగురు’. అనిల్ జేసన్ గూడూరును దర్శకునిగా పరిచయం చేస్తూ సరితా పట్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 4న ఈ సినిమా విడుదల కానుంది.
 
  ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్  మాట్లాడుతూ, ‘‘ఐదుగురు పాండవులు, ఒక్కడే కృష్ణుడు... ఈ కాన్సెప్ట్‌తో ఈ కథ తయారు చేశాం. ఐదుగురు యువకులుగా కొత్తవారిని పరిచయం చేశాం. ఇక వీరిని నడిపించే పాత్రను వెంకట్ పోషించారు. నా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు ఆ నలుగురు, వినాయకుడు. ఈ రెండూ నంది అవార్డులు అందుకున్నాయి. ఈ చిత్రంతో మూడోసారి నందిని అందుకోబోతున్నా’’ అని నమ్మకం వ్యక్తం చేశారు ప్రేమ్‌కుమార్. ఈ సినిమాలో ఓ కామెడీ పాత్ర చేశానని, ఇక నుంచి నటునిగా కూడా కొనసాగాలనుకుంటున్నానని ప్రేమ్‌కుమార్ చెప్పారు.
 
  ‘‘తెలుగు సినీ చరిత్రలోని టాప్ 100 చిత్రాల్లో నా ‘ఆ నలుగురు’ కూడా ఉంది. ఒక పాతాళభైరవి, ఒక శంకరాభరణం లాంటి క్లాసిక్స్‌తో పాటు నా ‘ఆ నలుగురు’ కూడా చెప్పుకుంటారు. ఒక నిర్మాతగా నాకిది చాలు. ఇక నుంచి కూడా విలువలతో కూడిన సినిమాలే తీస్తాను’’ అని ప్రేమ్‌కుమార్ వెల్లడించారు. చిన్న సినిమాలకు పంపిణీదారుల నుంచి కూడా ప్రోత్సాహం అందడం లేదని, ఎదురు డబ్బులిచ్చి సినిమాలను విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొందని, అదే బూతు సినిమాలనైతే... పోటీ పడి మరీ విడుదల చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

వారణాసిలో డిష్యుం డిష్యుం

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శివకార్తికేయన్‌ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌

వదిలేది లేదు

నయన్‌పై కీర్తి అభిమానుల ఆగ్రహం

‘బిగ్‌బాస్‌’సీరియస్‌.. శివజ్యోతి, రోహిణిలకు షాక్‌

క్రేజీ కాంబినేషన్‌

ఎవరి సలహాలూ వినొద్దన్నారు