సందడి చేసిన నటి

21 Feb, 2016 17:06 IST|Sakshi
సందడి చేసిన నటి

బహుభాష నటి హరిప్రియ బెంగళూరునగరంలో సందడి చేశారు. జయనగర్‌లో ఏర్పాటు చేసిన వీఆర్‌కే సిల్క్ షో రూంను శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ...‘నాకు సంప్రదాయ చీరలు అందులోనూ పట్టుచీరలంటే ఎక్కువ ఇష్టం. అందువల్లే బయటి ఫంక్షన్స్‌కు ఎక్కువగా నిండైన చీరలోనే. సినిమాలో మాత్రం పరిస్థితిని బట్టి దుస్తులు ధరిస్తాను. రీల్ లైఫ్‌తో పోలిస్తే రియల్ లైఫ్ వేరుగా ఉంటుంది.’ అని పేర్కొన్నారు. షో రూంలో మగువల మనసు దోచే అత్యుత్తమైన డిజైన్లలో కాంచిపురం  బెనారస్ తదిర పట్టు వస్త్రాలు ఉంటాయని సంస్థ  ఎండీ వి.రాజేందర్‌కుమార్ తెలిపారు.


 

>