వాళ్లతో చేయాలని ఉంది!

18 Jun, 2017 02:04 IST|Sakshi
వాళ్లతో చేయాలని ఉంది!

గ్లామర్‌ దుస్తుల్లోనే అందాలా? చీరలు, చుడీదారులు ధరించి కూడా అందాలను అందంగా కనిపించవచ్చునని అంటోంది నటి నిక్కీగల్రాణి. డార్లింగ్‌ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు యువ నటులందరికీ డార్లింగ్‌గా మారిపోయింది. చాలా తక్కువ కాలంలోనే 25 చిత్రాల మైలురాయిని దాటేసిన నిక్కీగల్రాణి కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్, మాలీవుడ్‌ అంటూ సౌత్‌ అంతా చుట్టేస్తోంది. నిక్కీగల్రాణి నటించిన 25వ చిత్రం మరగదనాణిమం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా ఉంటుందంటున్న నిక్కీగల్రాణితో చిన్న భేటీ.

ప్ర: కోలీవుడ్‌ యువ హీరోలందర్నీ ఆకట్టకున్నట్లున్నారే?
జ:యువ హీరోలనే కాదు తమిళ ప్రేక్షకులందర్నీ ఆకట్టుకున్నాననే సంతోషంతో ఉన్నాను. నేను అందరితోనూ సన్నిహితంగా ఉంటాను.

ప్ర: షూటింగ్‌ స్పాట్‌లో గోలగోల చేస్తారట?
జ: విష్ణువిశాల్, విక్రమ్‌ప్రభు, ఆది, జీవీ.ప్రకాశ్‌కుమార్‌ ఇలా చాలా మంది యువ హీరోలతో రెండు, మూడు సార్లు  నటించాను. వీళ్లంతా నాతో  స్నేహంగా ఉంటారు. అదే విధంగా నాకు హీరోయిన్‌ అన్న గర్వం ఏమీ ఉండదు. కెమెరా ముందు ఎలాగూ నటిస్తున్నాం. నిజజీవితంలోనూ నటిస్తే బాగుండదు. మనల్ని మనం అర్థం చేసుకోలేం. అందుకే నిజజీవితంలో నేను నేనుగానే ఉంటాను.

ప్ర: చాలా త్వరగా 25 చిత్రాలు పూర్తి చేసినట్లున్నారు?
జ: నా వృత్తిని మనçస్ఫూర్తిగా ప్రేమించడమే ఇందుకు కారణం. ఇంట్లో కాళీగా కూర్చోవడం నాకిష్టం ఉండదు. అదే విధంగా పనిపై తప్ప మరే అంశంపైనా దృష్టి సారించను. తక్కువ కాలంలో ఎక్కువ చిత్రాలు చేయడానికి ఇదీ ఒక కారణం కావచ్చు.

ప్ర: ఒకే తరహా పాత్రలు ప్రేక్షకులకు బోర్‌ కొడుతుందనుకుంటా?
జ: ఈ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ చూపుతాను. నేను ఎంచుకునే కథా చిత్రాలు, పాత్రలన్నీ వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడతాను. నా పాత్రల్లో కొత్తదనం ఉంటేనే నటించడానికి అంగీకరిస్తాను. అలా చాలెంజింగ్‌ పాత్రల్లో నటించాలని ఆశపడుతున్నాను.

ప్ర: స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు రావడం లేదా?
జ: నిజం చెప్పాలంటే పెద్ద హీరోలతో నటించాలనే కోరిక నాకూ ఉంది. అందుకు సరైన టీమ్‌ కావాలి. అందుకు తగిన టైమ్‌ రావాలి. ఆ టైమ్‌ కోసం ఎదురు చూస్తున్నా.

ప్ర: ఆ మధ్య నటించిన మొట్టశివ కెట్టిశివ చిత్రంలో అందాలారబోతలో హద్దులు మీరి నటించారనే విమర్శల గురించి మీ కామెంట్‌?
జ: ఇక్కడ మీకో నిజం చెప్పాలి. ఆ చిత్రంలో పాటల చిత్రీకరణ సమయంలో నా కాలుకు పెద్ద గాయమైంది. సరిగా డాన్స్‌ కూడా చేయలేక పోయాను. అయినా ఆ చిత్రంలోని పాటలను సక్సెస్‌ చేయాలన్న వెర్రి మాత్రం ఉండేది. ఇంకా చెప్పాలంటే కురచ దుస్తులు ధరించి నటిస్తేనే గ్లామర్‌ అనడం సరికాదు. అమ్మాయిల్ని, చీరల్లోనూ, చుడీదార్‌లోనూ అందంగా చూపించవచ్చు.