సమంతకు సారీ చెప్పాలి

29 May, 2020 00:36 IST|Sakshi

ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండటానికి, తమ గురించి అప్‌డేట్స్‌ ఇవ్వడానికి స్టార్స్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇందులో ఎంత ప్లస్సుందో కొంత మైనస్సు కూడా ఉంది. స్టార్స్‌ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను హ్యాక్‌ చేసి వాళ్లను ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టేస్తుంటారు హ్యాకర్స్‌. తాజాగా పూజా హెగ్డేకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాకయింది. ‘మజిలీ’ సినిమాలోని సమంత ఫొటోను షేర్‌ చేసి – ‘‘నాకెందుకో ఆమె (సమంత) అంత అందంగా అనిపించదు’’ అని పూజా ఇన్‌స్టాలో క్యాప్షన్‌ చేశారు హ్యాకర్స్‌.

వెంటనే పూజా అప్రమత్తయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిందని తెలిపారామె. ‘‘నా టెక్నికల్‌ టీమ్‌ సహకారంతో అకౌంట్‌ను మళ్లీ మా చేతుల్లోకి తీసుకున్నాం. హ్యాక్‌ అయిన సమయంలో నా అకౌంట్‌ నుంచి ఏదైనా పోస్ట్‌ అయ్యుంటే పెద్దగా పట్టించుకోకండి’’ అన్నారు పూజా. ఇదిలా ఉంటే.. పూజా హెగ్డే అకౌంట్‌లో సమంత గురించి ఇలా పోస్ట్‌ అవ్వడంతో సోషల్‌ మీడియాలో సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమంతకు పూజా హెగ్డే క్షమాపణలు చెప్పాలని ట్వీటర్‌లో ట్రెండ్‌ చేశారు సమంత ఫ్యాన్స్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా