ఒక రోజు జర్నీలో...

4 Sep, 2013 00:48 IST|Sakshi
ఒక రోజు జర్నీలో...
‘‘నేను ముంబైలో ఉన్నప్పుడు ఓ అర్ధరాత్రి ఓ మాస్ అబ్బాయి, ఓ క్లాస్ అమ్మాయి మాట్లాడుకోవడం విన్నాను. వారి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథ రాశాను. కామన్‌మేన్‌కి ఈజీగా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది’’ అని అడివి శేష్ చెప్పారు. 
 
 అడివి శేష్, ప్రియా బెనర్జీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కిస్’. అడివి శేష్ స్వీయదర్శకత్వంలో అడివి సాయికిరణ్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయికిరణ్ అడివి మాట్లాడుతూ -‘‘ ‘కిస్’ పాటలకు మంచి స్పందన వస్తోంది.
 
 ఒకమ్మాయికి, అబ్బాయికి మధ్య ఒక రోజు జరిగిన జర్నీని సింపుల్ రొమాంటిక్ స్టోరీగా తెరకెక్కించాం. ఈ నెల 13న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: షెనీల్ దియో, సహనిర్మాత: ఆనంద్ బచ్చు, నిర్వహణ: భవానీ అడవి.