వయస్సు నన్నేమీ ఇబ్బంది పెట్టదు..

15 May, 2015 12:21 IST|Sakshi
వయస్సు నన్నేమీ ఇబ్బంది పెట్టదు..

ముంబై:  పెరుగుతున్న వయస్సు నన్నేమి ఇబ్బంది పెట్టదు..జస్ట్ ఒక సంవత్సరం పెరిగింది అంతే.. అది  నన్ను  నియంత్రించలేదు..   టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటోంది బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్, అందాల రాణి మాధురి దీక్షిత్. డాన్సింగ్ విత్ మాధురి సెకండ్ వెర్షన్, మొబైల్ యాప్ను మొదలుపెట్టడమే తన బర్త్డే గిప్ట్ అని మురిసిపోతోంది.  ఏక్ దో తీన్ అంటూ అభిమానుల గుండెల్లో గుబులు రేపిన మాధురి   తన 48వ పుట్టినరోజును శుక్రవార జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా తనకు అన్ని వేళలా అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు మాధురి  ధన్యవాదాలు తెలిపింది. ఇప్పటికే  ఆన్లైన్లో  మాధురి  డాన్సింగ్ అకాడమీ  విజయవంతంగా  నడుస్తున్న విషయం తెలిసిందే.  గడప గడపకూ  తన డాన్స్ను తీసుకు వెళ్లాలన్నదే  తన లక్ష్యమని,  తన అకాడెమీ ద్వారా  డాన్స్ నేర్చుకోవాలనుకునే వారికి మేలు జరిగితే అంతే చాలని మాధురి తెలిపింది.  

1967   మే 15న  పుట్టిన మాధురీ దీక్షిత్ 1984లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తన  అద్భుతమైన నటనతో పాటు,  డాన్సింగ్ స్కిల్స్తో ఈ అందాల  తార అనతి కాలంలోనే టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైనా తన సెకండ్ ఇన్నింగ్స్తో మళ్లీ దుమ్ము రేపింది. తేజాబ్,  రామ లఖన్, దిల్,   దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే... దేవదాసు.  ఇలా ఆమె కెరీర్లో ఎన్నో  మైలు రాళ్లున్నాయి.   2008లో ఆమెకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. సో.. లెట్స్ విష్ హెర్ ఎ హ్యాపీ బర్త్ డే..