వైరలవుతోన్న మాజీ ప్రపంచ సుందరి ఫోటో

21 May, 2020 10:23 IST|Sakshi

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ‘థ్రోబ్యాక్‌’ చాలెంజ్‌ ట్రెండ్‌ అవుతోంది. దీనిలో భాగంగా సోషల్‌ మీడియా వేదికగా నెటిజనులు ఎన్నో విలువైన, అద్భుతమైన, అపురూప చిత్రాలను షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో అందాల రాణి, మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌కు సంబంధించిన ఓ అరుదైన ఫోటోను షేర్‌ చేశారు నెటిజనులు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరలవుతోంది. ఐశ్వర్య రాయ్‌ సింప్లిసిటీకి నెటిజనులు ఫిదా అవుతున్నారు. ఐశ్వర్య రాయ్‌ మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలిచిన తర్వాత తీసిన ఫోటో ఇది. దీనిలో ఆమె, తన తల్లి బ్రిందా రాయ్‌తో కలిసి కింద కూర్చుని భోజనం చేస్తున్నారు. తలపైన ప్రపంచ సుందరి కిరీటం ధరించినప్పటికి ఓ సాధారణ యువతిలా నేలపై కూర్చుని భోజనం చేయడం నిజంగా విశేషమే. దాంతో ‘అందం, అణకువల కలబోతకు నిదర్శనం ఈ ఫోటో’ అంటూ తెగ ప్రశంసిస్తున్నారు నెటిజనులు. (‘తన మాటలకు గర్వంగా ఉంది’)

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఐశ్వర్య రాయ్‌.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత కల్కి కష్ణమూర్తి రచించిన పాపులర్‌ నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ పీరియాడికల్‌ చిత్రంలో విక్రమ్, కార్తి, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. (స్వర్ణయుగం మొదట్లో..)

మరిన్ని వార్తలు