Rashmika: రష్మిక ఫేక్ వీడియో ఘటనపై 'మా' అధ్యక్షుడి ట్వీట్

8 Nov, 2023 17:11 IST|Sakshi

స్టార్ హీరోయిన్ రష్మిక ఫేక్ వీడియోపై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ తరఫున మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించాడు. ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేశాడు. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే?)

'డీప్ ఫేక్ కాంట్రవర్సీకి గురైన రష్మికకు నా మద్దతు తెలియజేస్తున్నాను. టెక్నాలజీని దుర్వినియోగం చేసే ఇలాంటి డేంజరస్ కంటెంట్‌ క్రియేట్ చేయడంపై మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) తీవ్రంగా ఆందోళన పడుతోంది. ఇలాంటి సంఘటనలపై పోరాడేందుకు అవసరమైన గైడ్‌లైన్స్ రూపొందించే దిశగా ఏఐ, న్యాయ నిపుణులతో 'మా' సంప్రదింపులు జరుపుతోంది.ఫేక్‌ వీడియోలపై తక్షణమై స్పందించాల్సిన అవసరం ఉందని రష్మికకు ఎదురైన ఘటన తెలియజేస్తోంది. ఏఐ టెక్నాలజీ సాయంతో నటీనటుల రక్షణకు భంగం కలిగించే ఇలాంటి వీడియోలను ‘మా’ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించదు.' అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు.

అసలేంటి గొడవ?
ఓ సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్ వీడియోకి డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించిన రష్మిక ఫేస్ చేర్చారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై ఫస్ట్ ఫస్ట్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఆ తర్వాత హీరో నాగచైతన్య, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కవిత కూడా స్పందించారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

(ఇదీ చదవండి: భూటాన్‌లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత)

మరిన్ని వార్తలు