‘రణబీర్‌ సలహాతో కోలుకున్నా’

15 Oct, 2019 13:17 IST|Sakshi

న్యూఢిల్లీ : కళంక్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద డీలా పడటంతో నిరాశలో కూరుకుపోయిన తాను రణ్‌బీర్‌ కపూర్‌ సూచనలతో కోలుకున్నానని బాలీవుడ్‌ నటి అలియా భట్‌ చెప్పుకొచ్చారు. రూ 100 కోట్లతో తెరకెక్కిన కళంక్‌ లైఫ్‌టైమ్‌ వసూళ్లు రూ 80 కోట్లకే పరిమితమవడం చిత్ర బృందాన్ని నిరుత్సాహపరిచింది. తాను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినా తన కష్టానికి ఫలితం దక్కలేదని తాను తీవ్ర నిర్వేదానికి లోనయ్యాయని అలియా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు.

ఈ సమయంలో తనకు తన బాయ్‌ఫ్రెండ్‌ రణబీర్‌ కపూర్‌ అండగా నిలిచారని, ఆయన చెప్పిన మాటలు తనకు స్వాంతన చేకూర్చాయని అలియా చెప్పారు. నువ్వు నీ శక్తిమేర కష్టపడ్డావని, అది ఇప్పటికిప్పుడు ఫలితాలు ఇవ్వకపోయినా కష్టపడే నటిగా, వ్యక్తిగా నీ శ్రమ వృధా కాదని, మరో సినిమా రూపంలో మంచి ఫలితంగా అది కనిపిస్తుందని రణబీర్‌ తనలో ధైర్యం నూరిపోశారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళంక్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌, నటి కరీనా కపూర్‌లు కూడా పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు