బన్నీ డాన్స్ స్టెప్స్‌కు పాన్ ఇండియా క్రేజ్

8 Feb, 2020 17:46 IST|Sakshi

సంక్రాంతికి విడుదలైన అలవైకుంఠపురంలో చిత్రం బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో, పాటలు అంతకన్నా పెద్ద హిట్టయ్యాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి ఈ సినిమా పాటలు ప్రతి ఇంట్లో మారుమోగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ సినిమాలోని 'బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే... జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే' అంటూ సాగే మెలోడీ సాంగ్  క్లాస్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బన్నీ ఈ పాటలో వేసిన స్టెప్స్‌ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అనుసరించడం విశేషం. తమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. 

ఇప్పుడు ఈ సాంగ్ టిక్ టాక్ లో మరింత ఫేమస్ అయ్యింది. తమిళనాడు, కేరళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్ ను టిక్ టాక్ చేశారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్ ను టిక్ టాక్ చేసి చేసింది, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సాంగ్ ఎంతటి పావులర్ అయ్యిందో. దీంతో అల్లూ అర్జున్‌ డాన్స్‌స్టెప్స్‌కు పాన్‌ ఇండియాలో యమా క్రేజ్‌ వచ్చింది. బుట్టబొమ్మ సాంగ్ కి టిక్ టాక్ లో దాదాపు 4.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించిన అలవైకుంఠపురంలో సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించాడు. ఈ సిని‍మాలో సుషాంత్‌, పూజాహెగ్డే, నివేదా పేతురాజ్‌, టబూ, మరళీ శర్మ, సముద్రఖని తదితరులు నటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా