ఈ వీడియో ఇప్పుడు వార్తల్లో

8 Jan, 2020 09:02 IST|Sakshi

సినిమా: నటిగా కంటే వివాదాస్పద సంఘటనలతోనే ఎక్కువగా పాపులర్‌ అయిన నటి అమలాపాల్‌ అని పేర్కొనవచ్చు. కోలీవుడ్‌లో తొలి చిత్రంలోనే చర్చనీయాంశ కథా పాత్రలో నటించి వార్తల్లోకి ఎక్కింది. ఆ తరువాత మైనా చిత్ర విజయంతో నటిగా పేరు తెచ్చుకుంది. ఇక దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడి సంచలన నటిగా ముద్ర వేసుకుంది. ఆయన్ని పెళ్లి చేసుకుని రెండేళ్లలోనే విడిపోయి విడాకులు తీసుకుని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయినా కథానాయకిగా నిలదొక్కుకుందంటే ఆమె సంపాధించుకున్న పాపులారిటీనే కారణం అని చెప్పవచ్చు. కాగా ఆ మధ్య ఒకతను అసభ్యంగా ప్రవర్తించాడని పోలీస్‌స్టేషన్‌ వరకరూ వెళ్లి కలకలం సృష్టించింది. అలా ఆమె ధైర్యానికి పోలీసులతో కూడా ప్రశంసులు అందుకుంది. ఇకపోతే విదేశాల నుంచి ఖరీదైన కారును కొనుగోలు చేసి, ఖర్చు తగ్గుతుందని పాండిచేరిలో రిజిస్టర్‌ చేయించుకుని వివాదాల్లోకి ఎక్కింది.

It all starts with A Vision! ✨ . . #wakeupandlift #girlswholift #weightlife #gymrat #fuelyourlife #fitfam #lifeinmumbai #AmalaPaul

A post shared by Amala Paul ✨ (@amalapaul) on

ఇలా అమలాపాల్‌ అంటేనే సంచలనం అన్నంతగా ముద్ర వేసుకున్న ఈ కేరళా కుట్టి. ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి మరోసారి చర్చకు తావిచ్చింది. కాగా సమీప కాలంలో వార్తల్లో ఎక్కడా కనిపించని అమలాపాల్‌ తాజాగా మరో సారి సామాజక మాధ్యాలకు పనిచెప్పింది. పిట్‌నెస్‌ కోసం కసరత్తులు చేస్తున్న వీడియో తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. అందులో అమలాపాల్‌ ఎంత కష్టపడి కసరత్తులు చేస్తున్నదో అందరికీ తెలిసేలా ఉంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆడై చిత్రం తరువాత అమలాపాల్‌ నటించిన చిత్రమేదీ తెరపైకి రాలేదు. కాగా ఈ సంచలన నటి నటించిన అదో అందపరవై పోల చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఒక మలయాళ చిత్రంతో పాటు వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది. కాగా తాజాగా బాలీవుడ్‌లో అడుగు పెట్టనుంది. అక్కడ హీరోయిన్లు ఎలా ఉంటే ఆదరిస్తారో తెలిసిందేగా. ఆ చిత్రం కోసమే ఈ అమ్మడు స్లిమ్‌గా తయారవ్వడానికి వరౌట్స్‌ చేస్తోందట. ఈ విషయాన్ని తెలియజేయడానికీ, పనిలో పనిగా ఉచిత ప్రచారం పొందడానికీ తన కసరత్తుల వీడియోను విడుదల చేసింది. ఇలా వార్తల్లో ఉండడంలో అమలాపాల్‌ తనకు తానే చాటి అని మరోసారి రుజువు చేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఛీ.. ఇంతకు దిగజారుతావా దీపిక’

వీధుల్లోకి రావడం బాగుంది: దీపిక

మరో చిత్రానికి పచ్చజెండా?

పరిణీతి అవుట్‌ నోరా ఇన్‌

నాకు డబుల్‌ హ్యాపీ- బి.ఎ. రాజు

సినిమా

‘ఛీ.. ఇంతకు దిగజారుతావా దీపిక’

ఈ వీడియో ఇప్పుడు వార్తల్లో

మరో చిత్రానికి పచ్చజెండా?

వీధుల్లోకి రావడం బాగుంది: దీపిక

నాకు డబుల్‌ హ్యాపీ- బి.ఎ. రాజు

నవ్వుల రచయితకు నివాళి