అమితాబ్‌ మొదటి సినిమా పారితోషకం..

4 Mar, 2019 19:44 IST|Sakshi

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ‌చ్చన్‌‌.. తాప్సీ  ప్రధాన పాత్ర న‌టిస్తున్న చిత్రం బ‌ద్లా. ప్రముఖ దర్శకుడు సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ నిర్మిస్తున్నాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ అమితాబ్‌, షారుఖ్‌లతో చిట్‌చాట్‌ నిర్వహించింది. ఈ వీడియోను షారుఖ్‌ ఇటీవల విడుదల చేశారు. 8 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో పలు ఆసక్తికరమైన విషయాలను ఇద్దరు బిగ్‌ స్టార్స్‌ పంచుకున్నారు. అలహాబాద్‌ నుంచి బాలీవుడ్‌కు ఎలా వచ్చారో బిగ్‌బీ వివరించారు. తన మొదటి సినిమా పారితోషకం రూ. 5000 మాత్రమేనని చెపారు. ‘1969 ఫిబ్రవరి 15న తొలి ‘సాత్‌ హిందుస్తానీ’ సినిమా సంతకం చేసి రూ.5000 చెక్కును తీసుకున్నాను. ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవుతుంది.’ అని 76ఏళ్ల అమితాబ్‌ తన తొలినాటి జ్ఞాపకాల్ని పంచుకున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్ గా తెరకెక్కించిన ‘బద్లా’మార్చి 9న విడుద‌ల కానుంది.

మరిన్ని వార్తలు