103 ఏళ్ల బామ్మ వీడియో వైరల్

30 Apr, 2018 16:36 IST|Sakshi

వీడియో పోస్ట్ చేసిన మెగాస్టార్ అమితాబ్

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘102 నాటౌట్‌’.. గుజరాతీ నాటకం ఆధారంగా ఉమేశ్‌ శుక్లా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బిగ్‌బీ అమితాబ్ 102 ఏళ్ల వృద్ధుడి పాత్ర పోషిస్తున్నారు. ఆయన కుమారుడిగా 70 ఏళ్ల వ్యక్తిగా మరో సీనియర్ నటుడు రిషీ కపూర్‌ నటించారు. మే 4న ఈ మూవీ విడుదల చేసేందుకు యూనిట్ సిద్దంగా ఉంది. అయితే మూవీపై స్పందిస్తూ 103 ఏళ్ల బామ్మ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. రెండున్నర దశాబ్దాల తర్వాత అమితాబ్, రిషీ కపూర్ కలిసి నటిస్తున్న చిత్రమిది.
 

బామ్మ చేసిన పోస్టును అమితాబ్ తన ఫేస్‌బుక్, ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. 'ఆల్ ది బెస్ట్ అమితాబ్.. నువ్వు 102 నాటౌట్ అయితే నేను 103 నాటౌట్ అంటూ' బామ్మ పోస్ట్ చేసిన వీడియోను అమితాబ్‌ తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. 103 ఏళ్ల వయసులో బామ్మ అంత యాక్టీవ్‌ ఉంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'ఈ లవ్లీ లేడీ మాకు విషెస్ తెలిపారు. ఆమెను దేవుడు చల్లగా చూడాలంటూ' అమితాబ్ పోస్టు చేయగా వీడియో వైరల్ అవుతోంది. మూవీకి భలేగా ప్రమోషన్ లభించిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు