అమితాబ్‌ కూతురికి బహుమతిగా కోట్లు విలువ చేసే బంగ్లా!

25 Nov, 2023 12:36 IST|Sakshi

నటనకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌. 80 ఏళ్లు దాటినా కుర్రాళ్లకంటే హుషారుగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అంతేకాదు పాపులర్‌ టీవీ షో ‘కౌన్‌ బనేగా క్రోర్‌పతి’కి హోస్ట్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ఇలా వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీకి మాత్రం దూరంగా ఉండలేరు బిగ్‌బీ. బాధ్యత గల తండ్రిగా  ఇప్పటికీ తన పిల్లల బాగోగులను చూసుకుంటున్నారు.

(చదవండి: పరశురామ్‌తో గొడవ..గతంలో జరిగింది ఇదే: బన్నీ వాసు)

కొడుకుతో పాటు కూతురు శ్వేతా బచ్చన్‌పై కూడా అమితాబ్‌కి ఎనలేని ప్రేమ. పెళ్లి చేసి అత్తారింటికి పంపించినా.. ఇప్పటికీ ఆమెకు ఆర్థికంగా ఆదుకుంటూనే ఉంటాడు. తాజాగా తన కూతురుకి ఖరీదైన బహుమతిని అందించి, తండ్రి ప్రేమను చాటుకున్నాడు. తనకెంతో ఇష్టమైన జుహు బంగ్లా ‘ప్రతీక్ష’ను కూతురు శ్వేతా బచ్చన్‌కు గిఫ్ట్‌గా అందించారు. దీని విలువల దాదాపు 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 

(చదవండి: అన్నదమ్ముల మధ్య ఈగో, డబ్బు సమస్యలు ఉండొద్దు: మనోజ్‌)

ముంబైలోని అంత్యంత ఖరీదైన జై జుహు ప్రాంతంలో అమితాబ్‌ బంగ్లా ‘ప్రతీక్ష’ ఉంది. ఈ బంగ్లా అంటే అమితాబ్‌కు చాలా ఇష్టం. తన పేరెంట్స్‌తో కలిసి అమితాబ్‌ ఇక్కడే ఉండేవాడు. అంతేకాదు అభిషేక్‌, ఐశ్వర్యల పెళ్లి కూడా ఇక్కడే జరిగింది.  ఇది మొత్తం 674 చదరపు మీటర్లు, 890.47 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు ప్లాట్స్‌లో విస్తరించి ఉంది.  అమితాబ్‌ ఫ్యామిలీ ప్రస్తుతం జుహులో ఉన్న జల్సా బంగ్లాలో నివసిస్తోంది. 

A post shared by S (@shwetabachchan)

మరిన్ని వార్తలు